నకిలీ పత్రాలతో బ్యాంకుకు బురిడీ
ABN, Publish Date - Oct 26 , 2024 | 02:01 AM
రుణం తీసుకుని రెండేళ్ళు కావస్తున్నా అక్కడ పరిశ్రమ స్థాపించలేదు. సకాలంలో రుణ కంతులనూ చెల్లించలేదు. దీనిపై బ్యాంకు అధికారులు ఆరా తీశారు. మరోవైపు బ్యాంకులో తాకట్టు పెట్టిన భూమి పత్రాలను పరిశీలించారు. వాళ్లు ఒకవేళ రుణం చెల్లించకుంటే తనఖా పెట్టిన భూమినైనా వేలం వేసుకోవడానికి అవకాశం ఉంటుందని భావించారు. ఆ మేరకు డాక్యుమెంట్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకెళ్ళి పరిశీలించగా అవి నకిలీవని తేలింది.
ఎస్‌బీఐ అనుబంధ ఎస్‌ఎంఈ బ్రాంచిలో రూ.2.8 కోట్ల రుణం
ఆపై పరిశ్రమ ఏర్పాటు చేయని వైనం
పోలీసులను ఆశ్రయించిన అధికారులు
ఆలస్యంగా వెలుగులోకి..
అసలు విషయం వెలుగు చూసిందిలా..
రుణం తీసుకుని రెండేళ్ళు కావస్తున్నా అక్కడ పరిశ్రమ స్థాపించలేదు. సకాలంలో రుణ కంతులనూ చెల్లించలేదు. దీనిపై బ్యాంకు అధికారులు ఆరా తీశారు. మరోవైపు బ్యాంకులో తాకట్టు పెట్టిన భూమి పత్రాలను పరిశీలించారు. వాళ్లు ఒకవేళ రుణం చెల్లించకుంటే తనఖా పెట్టిన భూమినైనా వేలం వేసుకోవడానికి అవకాశం ఉంటుందని భావించారు. ఆ మేరకు డాక్యుమెంట్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకెళ్ళి పరిశీలించగా అవి నకిలీవని తేలింది. దీంతో వారు తిరుపతి క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ తతంగం జరిగి ఆరేడు నెలలయ్యాయి. ఇదే కేసులో మొదటి నిందితుడ్ని మాత్రం గత నెల 20న క్రైం పోలీసులు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. మరో ముగ్గురి వరకు పరారీలో ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అదేవిధంగా, అప్పట్లో రుణం మంజూరు చేసిన మేనేజర్, అధికారుల పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అప్పటి మేనేజరు.. ప్రస్తుతం విజయవాడలో ఉన్నట్లు సమాచారం.
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకు అధికారులనే బురిడీ కొట్టించారు. పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు రూ.2.8 కోట్లు తీసుకుని.. పత్తాలేకుండా పోయారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో తిరుపతి క్రైం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. రేణిగుంట మండలం వెంకటాపురం వద్ద లక్ష్మీ నరసింహ ఇండస్ట్రీ పేరిట ఫ్లోర్ క్లీనింగ్ క్లాత్‌ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు చిలకలూరిపేట, నరసారావుపేటకు చెందిన కొందరు ప్లాన్ చేశారు. దీనికి బ్లూ ప్రింట్లు, స్థలానికి సంబంధించి ఈసీ, మూల పత్రాలు తదితరాలను సిద్ధం చేసుకున్నారు. పరిశ్రమల శాఖ అనుమతుల కోసం దరఖాస్తు చేయగా.. ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు రాలేదు. ఇక, తిరుపతి బాలాజీ కాలనీలో స్టేట్ బ్యాంకుకు అనుబంధంగా ఎస్‌ఎంఈ బ్రాంచి ఉంది. ఇక్కడ చిన్న తరహా.. కుటీర పరిశ్రమలు, చేతివృత్తుల వారికి రుణాలు మంజూరు చేస్తారు. దీతో వీరు ఎస్‌ఎంఈ బ్రాంచ్‌ని సంప్రదించారు. రుణానికి అవసరమైన డాక్యుమెంట్లు, భూమి పత్రాలను సమర్పించారు. బ్యాంకు అధికారులు కూడా పరిశ్రమను ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలించారు. నిబంధనల మేరకు అన్నీ సక్రమంగా ఉన్నాయని రెండేళ్ల కిందట రూ.2.80 కోట్ల రుణం మంజూరు చేశారు.
Updated Date - Oct 26 , 2024 | 07:10 AM