Chengal Reddy ఆర్టీసీ జోన్ 4 ఈడీగా చెంగల్‌రెడ్డి
ABN, Publish Date - Sep 12 , 2024 | 02:38 AM
ఆర్టీసీ కడప జోన్ 4 ఫుల్‌చార్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా తిమ్మాడి చెంగల్‌రెడ్డి నియమితులయ్యారు. ఆ స్థానంలో ఉన్న గిడుగు వెంకటేశ్వర్లు రెండు నెలల క్రితం బదిలీ అయిన విషయం తెలిసిందే.
తిరుపతి(ఆర్టీసీ), సెప్టెంబరు 11: ఆర్టీసీ కడప జోన్ 4 ఫుల్‌చార్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా తిమ్మాడి చెంగల్‌రెడ్డి నియమితులయ్యారు. ఆ స్థానంలో ఉన్న గిడుగు వెంకటేశ్వర్లు రెండు నెలల క్రితం బదిలీ అయిన విషయం తెలిసిందే.తిరుపతి జిల్లా ప్రజారవాణాధికారిగా వున్న టి.చెంగల్‌రెడ్డిని ఫుల్‌చార్జ్ ఈడీగా నియమిస్తూ ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు ఉత్తర్వులు జారీచేశారు.రాయలసీమ పరిధిలోని తిరుపతి, చిత్తూరు,కడప, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాలకు ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.
Updated Date - Sep 12 , 2024 | 07:08 AM