ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘జే-న్యూటౌన్‌’ అక్రమాలపై కలెక్టర్‌ విచారణ

ABN, Publish Date - Dec 03 , 2024 | 02:33 AM

పుంగనూరు బైపాస్‌ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జే-న్యూటౌన్‌ వెంచర్‌ అక్రమాలపై కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ విచారణ చేపట్టారు.

పుంగనూరు బైపాస్‌ రోడ్డులోని జే-న్యూ టౌన్‌

పుంగనూరు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పుంగనూరు బైపాస్‌ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జే-న్యూటౌన్‌ వెంచర్‌ అక్రమాలపై కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ విచారణ చేపట్టారు. కర్నూలు-వేలూరు జాతీయ రహదారి పక్కనే రాయలపేటకు వెళ్లే మార్గం వద్ద వైసీపీ ప్రభుత్వంలో నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి దాదాపు 70 ఎకరాల్లో వేసిన వెంచర్‌లో అక్రమాలు జరిగినట్లు కొందరు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో సీఎం కార్యాలయం, మంత్రి పేషీ నుంచి వచ్చిన ఆదేశాలతో సోమవారం కలెక్టరేట్‌లో అధికారులు, ఫిర్యాదుదారులతో కలెక్టర్‌ మాట్లాడారు. ఫిర్యాదుదారుల మాటల్లోనే.. ‘వెంచర్‌ పక్కనే ఉన్న తీగలమ్మ చెరువు మొరవను ఆక్రమించి కాల్వను కుదించి సిమెంట్‌ పైపులు ఏర్పాటు చేశారు. 22ఏలో ఉన్న పొరంబోకు భూమిని కొంత ఆక్రమించి వెంచర్‌లో కలిపారు. బ్యూటిఫికేషన్‌ పేరుతో ఎన్‌హెచ్‌ రోడ్డును దర్జాగా ఆక్రమించారు. గుడిసెబండ పంచాయతీ పెంచుపల్లెకు వెళ్లే రోడ్డును వెంచర్‌లో కలిపేసుకున్నారు. మాజీ ఎంపీ ఎన్‌.రామకృష్ణారెడ్డి ఎంపీల్యాడ్స్‌తో నిర్మించిన బస్‌షెల్టర్లు కూల్చి వేసి.. ఆక్రమించారు. వెంచర్‌ పనులకు అక్రమంగా పంచాయతీ విద్యుత్‌ వాడుకున్నారు. విద్యుత్‌శాఖ ట్రాన్స్‌ఫార్మర్‌, పోల్స్‌ ఏర్పాటులోనూ అక్రమాలు జరిగాయి. ప్రభుత్వ నిబంధనలు పాటించలేదు’ అని కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. జే-న్యూటౌన్‌పై సమగ్రంగా విచారించి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ జే.రాము, ఆర్‌ఐ ఫణికుమార్‌లను ఆదేశించారు. గతంలో ఉన్న తహసీల్దార్‌ శివయ్య విచారణ జరిపి నివేదిక ఇచ్చారని వారు చెప్పినా.. మీరు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తాను కూడా త్వరలోనే జే-న్యూటౌన్‌ తనిఖీకి వస్తానని చెప్పారు.

Updated Date - Dec 03 , 2024 | 02:33 AM