ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గృహ ప్రవేశానికి వచ్చి మృత్యు ఒడికి..

ABN, Publish Date - Nov 15 , 2024 | 02:13 AM

వారందరూ ఒకే కుటుంబ సభ్యులు. గృహ ప్రవేశానికి హాజరయ్యేందుకు వచ్చారు. మార్గం మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్ల మృతి

తిరుపతి(నేరవిభాగం), నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): వారందరూ ఒకే కుటుంబ సభ్యులు. గృహ ప్రవేశానికి హాజరయ్యేందుకు వచ్చారు. మార్గం మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిలోని వేదాంతపురం వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. తిరుపతి రూరల్‌ సీఐ చిన్నగోవిందు కథనం మేరకు... తిరుపతి రూరల్‌ మండలం ధనలక్ష్మినగర్‌ క్షత్రియ ఎన్‌క్లేవ్‌ అపార్టుమెంటులో కాపురముంటున్న బిల్డర్‌ రాజశేఖర రాజు వేదాంతపురం పంచాయతీ ఎంజీ బ్రదర్స్‌ లేఅవుట్‌లో నూతనంగా ఇల్లు నిర్మించాడు. గృహ ప్రవేశానికి అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రంగంపల్లి నుంచి ఆయన తల్లి సావిత్రి(80), చెల్లెళ్లు సంగీత(38), జ్యోతి, లక్ష్మీదేవి వచ్చారు. టీఎన్‌ 12-4581 నెంబరు కారులో ధనలక్ష్మినగర్‌ నుంచి గృహ ప్రవేశం జరుగుతున్న ఎంజీ బ్రదర్స్‌ లేఅవుట్‌కు బయలుదేరారు. వేదాంతపురం క్రాస్‌ వద్ద బైపాస్‌ దాటుతుండగా నల్గొండ నుంచి బెంగళూరుకు వెళుతున్న బాలాజీ ట్రావెల్స్‌ బస్సు వేగంగా ఢీకొంది. దాదాపు 50 అడుగుల వరకు లాక్కెళ్లడంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న సావిత్రి, సంగీత తీవ్రంగా గాయపడ్డారు. జ్యోతి, లక్ష్మీదేవి స్వల్పంగా గాయపడ్డారు. వీరిని తిరుపతి రుయాకు తరలించారు. చికిత్స పొందుతూ సావిత్రి, సంగీత మృతి చెందారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని పోలీసులు చెప్పారు. సంగీత తిరుపతి రూరల్‌ ఎక్సైజ్‌ పోలీ్‌సస్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రమేష్‌ భార్య. కాగా బస్సు డ్రైవర్‌ సురే్‌షను అదుపులోకి తీసుకుని బస్సును సీజ్‌ చేసినట్లు పోలీసులు చెప్పారు. రాజశేఖర్‌ రాజు తమ్ముడు రాఘవరాజు ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, బంఽధువులకు అప్పగించినట్లు సీఐ చెప్పారు.

Updated Date - Nov 15 , 2024 | 02:13 AM