ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సత్య ప్రమాణానికి రండి

ABN, Publish Date - Aug 11 , 2024 | 02:04 AM

‘సత్య ప్రమాణం చేయడానికి రాజనాల బండకు రండి’ అంటూ కమ్మలు పోగొట్టుకున్న బాధితులు పిలవగానే నిందితుల్లో వణుకు మొదలైంది. రాత్రికి రాత్రే ఆ కమ్మలు, నగదు మూటకట్టి బాధితుడి ఆటోలో ఉంచి వెళ్లిపోయారు.

బంగారు కమ్మలతో స్వామి వారికి పూజలు చేస్తున్న బాలసుబ్రహ్మణ్యం కుటుంబీకులు

చౌడేపల్లె, ఆగస్టు10: ‘సత్య ప్రమాణం చేయడానికి రాజనాల బండకు రండి’ అంటూ కమ్మలు పోగొట్టుకున్న బాధితులు పిలవగానే నిందితుల్లో వణుకు మొదలైంది. రాత్రికి రాత్రే ఆ కమ్మలు, నగదు మూటకట్టి బాధితుడి ఆటోలో ఉంచి వెళ్లిపోయారు. రాజనాలబండ టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ భానుప్రకాష్‌ తెలిపిన ప్రకారం.. కర్ణాటకలోని కొత్తమనగలానికి బాలసుబ్రహ్మణ్యం ఆటో నడుపుకొంటున్నారు. బీరువాలో ఉంచిన అతడి భార్య చెవి కమ్మలు, మాటీలు నెల కిందట చూడగా కనిపించలేదు. చుట్టుపక్కల వారికి అడిగినా ప్రయోజనం లేకపోయింది. గ్రామపెద్దల సూచన మేరకు ఆలయ నిర్వాహకుల వద్ద అనుమతి తీసుకుని రాజనాల బండలో సత్య ప్రమాణానికి చుట్టు పక్కల ఇళ్లవారిని పిలిచారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి బంగారు కమ్మలు, రూ.20వేల నగదు గుడ్డలో మూటకట్టి గుర్తు తెలియని వ్యక్తులు తన ఆటోలో ఉంచినట్లు బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. మాటీలకు బదులు, డబ్బులు ఆ మూటలో ఉన్నాయన్నారు. స్వామి మహిమతోనే నగలు వచ్చాయంటూ శనివారం రాజనాల బండ వద్ద పూజలు నిర్వహించారు.

Updated Date - Aug 11 , 2024 | 02:04 AM

Advertising
Advertising
<