ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడిగా సీఆర్‌రాజన్‌

ABN, Publish Date - Mar 20 , 2024 | 01:09 AM

చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా తిరుచానూరు మాజీ సర్పంచ్‌ సీఆర్‌ రాజన్‌ నియమితులయ్యారు.ఇప్పటి వరకూ ఆ పదవిలో వున్న పులివర్తి నానీ చంద్రగిరి నియోజకవర్గ ఇంఛార్జిగానూ, టీడీపీ అభ్యర్థిగానూ ఎన్నికల్లో బిజీగా వుండడంతో ఆయన స్థానంలో రాజన్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియమించారు

తిరుపతి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా తిరుచానూరు మాజీ సర్పంచ్‌ సీఆర్‌ రాజన్‌ నియమితులయ్యారు.ఇప్పటి వరకూ ఆ పదవిలో వున్న పులివర్తి నానీ చంద్రగిరి నియోజకవర్గ ఇంఛార్జిగానూ, టీడీపీ అభ్యర్థిగానూ ఎన్నికల్లో బిజీగా వుండడంతో ఆయన స్థానంలో రాజన్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియమించారు.తిరుచానూరు ప్రాంతంలో ప్రాబల్యం కలిగిన రాజన్‌ వన్నియకుల క్షత్రియ సంఘం రాష్ట్ర కోశాధికారిగా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా పని చేశారు. ఈ ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ టికెట్‌ ఆశించారు. దీనికోసం ఆయన చిత్తూరుకు మకాం మార్చి కొంతకాలం అక్కడే పార్టీలో చురుగ్గా పనిచేశారు. అయితే పలు సమీకరణల కారణంగా ఆయనకు టికెట్‌ దక్కలేదు. దానివల్ల ఆయనకు పార్టీలో సముచిత గుర్తింపు, గౌరవం కల్పించడంతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో గణనీయంగా వున్న వన్నెకుల క్షత్రియ సామాజికవర్గాన్ని సంతృప్తి పరిచేందుకు రాజన్‌కు కీలక పదవి కట్టబెట్టారు. కుప్పం మొదలుకుని చిత్తూరు, చంద్రగిరి, నగరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో వన్యకుల క్షత్రియులు అధికంగా వున్నారు. ఆ సామాజికవర్గంలో ప్రాబల్యం కలిగిన రాజన్‌కు చిత్తూరు పార్లమెంటు అధ్యక్ష పదవి కేటాయించడం టీడీపీకి గణనీయంగా లాభించనుంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని హోరాహోరీగా పోరాడుతున్న పులివర్తి నానీ వ్యూహాత్మకంగా రాజన్‌కు ఈ పదవి దక్కేలా అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం.చిత్తూరు పార్లమెంటు ఉపాధ్యక్షులుగా ఇ.శ్రీనివాసులు (చిత్తూరు) పీసీ మణి (రామచంద్రా పురం), వాణిజ్యవిభాగం ఉపాధ్యక్షుడిగా ఎస్‌ఏ ప్రసాద్‌ రెడ్డి, ఎం.గోపి (చిత్తూరు), సాంస్కృతిక విభాగం ఉపాధ్యక్షుడిగా జి.రమేష్‌, టీచర్స్‌ యూనియన్‌ ఉపాధ్యక్షుడిగా ఎస్‌.నరసింహులు (చిత్తూరు) నియమితులయ్యారు.

Updated Date - Mar 20 , 2024 | 01:09 AM

Advertising
Advertising