ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

1,446 ఎకరాల్లో పంట నష్టం

ABN, Publish Date - Dec 03 , 2024 | 02:18 AM

ఫెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో సోమవారం కూడా వర్షం కురుస్తూనే ఉంది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూనే ఉంది. జిల్లా, డివిజన్‌, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌లు యథావిధిగా పనిచేస్తున్నాయి.

బంగారుపాళ్యం మండలంలో వరికుప్పల్లోకి చేరిన వర్షపునీరు

ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా

ఆరు పశువుల మృతి

కురుస్తూనే ఉన్న వర్షం

చిత్తూరు కలెక్టరేట్‌ / చిత్తూరు సెంట్రల్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఫెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో సోమవారం కూడా వర్షం కురుస్తూనే ఉంది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూనే ఉంది. జిల్లా, డివిజన్‌, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌లు యథావిధిగా పనిచేస్తున్నాయి. ఆదివారం పెనుమూరు మండలంలోని ఎన్టీఆర్‌ జలాశయం గేట్లను ఎత్తేయగా.. సోమవారం కార్వేటినగరం మండలంలోని కృష్ణాపురం జలాశయ గేట్లను ఎత్తేసి నీళ్లను కిందికి వదిలారు. జిల్లాలోని అన్ని చెరువుల్లోనూ నీటిమట్టం పెరిగింది.

పంట నష్టమిలా..

జిల్లాలో 1446 ఎకరాల్లో సాధారణ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 85 గ్రామాల్లో 810 మంది రైతులు 1199 ఎకరాల్లో సాగు చేసిన వరి దెబ్బతినగా, 18 గ్రామాల్లో 182 మంది రైతులు 247 ఎకరాల్లో సాగుచేసిన టమోటా, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా సోమల మండలంలోని 13 గ్రామాల్లో 327 మంది రైతులు 560 ఎకరాల్లోని వరిసాగు దెబ్బతింది. పుంగనూరు మండలంలోని 14 గ్రామాల్లో 215 మంది రైతులు 260 ఎకరాల్లో వరి పంట నీటి మునిగింది. 75 ఎకరాల్లో ఉర్ల సాగు, వి.కోట, బైరెడ్డిపల్లె మండలాల్లో 20 గ్రామాల్లో 132 మంది రైతులు 184.5 ఎకరాల్లో సాగు చేసిన ఉర్ల, వంకాయ, కాకరకాయ తదితర పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు పంటలను పరిశీలించి నష్టం వివరాలను నమోదు చేశారు. ప్రాథమిక సమాచారం మేరకు దెబ్బతిన్న పంట తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పశు నష్టమిలా..

పెద్దపంజాణి మండలంలో ఓ రైతుకు చెందిన రెండు పాడి ఆవులు, రెండు దూడలు, చౌడేపల్లెలో ఒక ఆవు, రామసముద్రంలో ఒక గొర్రె మృతి చెందాయి. గంగాధరనెల్లూరు మండలంలోని ఓ గుడిసె పాక్షికంగా దెబ్బతింది.

ఒక్కరోజులోనే ఈనెల సాధారణ వర్షపాతం నమోదు

డిసెంబరు నెల జిల్లా సాధారణ వర్షపాతం 54.8 మి.మీ కాగా, ఆదివారం ఒక్కరోజే సాధరణానికి మించి 57.4 మి.మీ వర్షపాతం నమోదైంది. నవంబరు నెల జిల్లా సాధారణ వర్షపాతం 141.8 మి.మీ కాగా, శనివారం వరకు 68.3 లోటుతో 44.9 మి.మీ మాత్రమే కురిసింది. ఆదివారం ఉదయం ఎనిమిది నుంచి సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకు జిల్లావ్యాప్తంగా 33.7 మి.మీ సగటు వర్షపాతం నమోదయ్యింది. చిత్తూరులో అత్యధికంగా 63.0 మి.మీ, నగరిలో అత్యల్పంగా 14.2 మి.మీ వర్షం కురిసింది. మండలాలవారీగా.. సోమలలో 55.8, రామకుప్పంలో 46.4, చౌడేపల్లెలో 45, గుడిపాలలో 43.8, యాదమరిలో 42.6, శ్రీరంగరాజపురంలో 41.6, కార్వేటినగరంలో 41.4, చిత్తూరు రూరల్‌లో 39.4, శాంతిపురంలో 39.2, గంగవరంలో 37.8, వి.కోటలో 37.4, పలమనేరులో 35.8, బైరెడ్డిపల్లెలో 34.6, గంగాధరనెల్లూరులో 33.6, కుప్పంలో 33, సదుంలో 32.6, పెనుమూరులో 32.4, గుడుపల్లెలో 28.8, బంగారుపాళ్యంలో 28.6, పాలసముద్రంలో 28.2, పూతలపట్టులో 26.6, తవణంపల్లెలో 26.2, పెద్దపంజాణిలో 26, పుంగనూరులో 25.6, ఐరాలలో 25, నిండ్రలో 24.6, పులిచెర్లలో 24, రొంపిచెర్లలో 22.8, వెదురుకుప్పంలో 22, విజయపురంలో 21.4 మి.మీ వర్షం కురిసింది.

Updated Date - Dec 03 , 2024 | 02:18 AM