ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దెబ్బతిన్న పంటలు

ABN, Publish Date - Dec 03 , 2024 | 02:41 AM

జిల్లావ్యాప్తంగా ఫెంగల్‌ తుఫాను ప్రభావంతో శుక్రవారం రాత్రి నుంచీ కురిసిన వర్షాలకు పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా మేరకు మొత్తం 10,200 ఎకరాల్లో వరి, వేరుశనగ పంటలకు నష్టం జరిగింది. రబీ సీజను ప్రారంభం కావడంతో ప్రధానంగా నారు దశలో ఉన్న వరి పంట నీట మునిగింది. వేరుశనగదీ అదే పరిస్థితి. దెబ్బతిన్న పంటలకు సంబంధించి 4338 మంది రైతులు నష్టపోయారు.

దొరవారిసత్రం మండలం కొత్తపల్లిలో ఇసుక మేట వేసిన వేరుశనగ పొలం (ఇన్‌సెట్‌లో) ఆనేపూడిలో మొలకెత్తిన వేరుశనగ

జిల్లావ్యాప్తంగా ఫెంగల్‌ తుఫాను ప్రభావంతో శుక్రవారం రాత్రి నుంచీ కురిసిన వర్షాలకు పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా మేరకు మొత్తం 10,200 ఎకరాల్లో వరి, వేరుశనగ పంటలకు నష్టం జరిగింది. రబీ సీజను ప్రారంభం కావడంతో ప్రధానంగా నారు దశలో ఉన్న వరి పంట నీట మునిగింది. వేరుశనగదీ అదే పరిస్థితి. దెబ్బతిన్న పంటలకు సంబంధించి 4338 మంది రైతులు నష్టపోయారు. సూళ్లూరుపేట, వరదయ్యపాళెం ప్రాంతాల్లో నీట మునిగిన పంటలు కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకొన్నారు. ఇక, తుఫాను వల్ల ఒక ఎద్దు, ఒక ఆవు, నాలుగు దూడలు, నాలుగు గొర్రెలు మృతిచెందాయి. రెండు పక్కా ఇళ్ళు పాక్షికంగా దెబ్బతినగా మరో నాలుగు గుడిసెలు నేలమట్టమయ్యాయి.

154 కి.మీ.ల మేర 14 రోడ్లు ధ్వంసం

పంచాయతీ రాజ్‌ శాఖ పరిధిలో 34.72 కిలోమీటర్ల మేర ఎనిమిది రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ.31 లక్షలు, శాశ్వత రిపేర్లకు రూ.3.15 కోట్లు అవసరమని ఆ శాఖ అంచనా వేసింది. ఆర్‌అండ్‌బీ పరిధిలో 120 కిలోమీటర్ల మేర ఆరు రోడ్లు పాడయ్యాయి. రోడ్ల ఉపరితం కొట్టుకుపోగా మరమ్మతులకు రూ.2 కోట్లు.. తాత్కాలిక రిపేర్లకు రూ. 60 లక్షలు.. శాశ్వత మరమ్మతులకు రూ.1342 కోట్లు అవసరమని ఆ శాఖ అధికారులు నివేదించారు.

విద్యుత్‌ శాఖకు రూ. కోటి నష్టం

ఎస్పీడీసీఎల్‌కు సంబంధించి 198 విద్యుత్‌ స్తంభాలు నేలకూలగా, 90 ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. 30 కిలోమీటర్ల మేర 11 కేవీ, ఎల్‌టీ విద్యుత్‌ తీగలు తెగిపోయాయి. మొత్తం సుమారు రూ. కోటి వరకు నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

తక్షణ అవసరం రూ.3.66 కోట్లు

ఫెంగల్‌ తుఫానుతో జరిగిన నష్టం అంచనా వేయడంలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ప్రాథమిక సేకరించిన సమాచారం మేరకు జిల్లాలో 240 గ్రామాలు తుఫాను ప్రభావానికి గురయ్యాయి. పీఆర్‌, ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌ శాఖలకు కలిగిన నష్టాలకు సంబంధించి తాత్కాలిక మరమ్మతులకు రూ.3.66 కోట్లు.. శాశ్వత పనులకు రూ.1346 కోట్లు (గత తుఫానులో దెబ్బతిన్నవి కలిపి) కావాలని ప్రతిపాదించారు.

Updated Date - Dec 03 , 2024 | 02:41 AM