మహిళల కళ్లలో ఆనందం కోసమే దీపం పథకం
ABN, Publish Date - Nov 03 , 2024 | 02:22 AM
వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడిన మహిళల కళ్లలో ఆనందం కోసమే దీపం పథకం తీసుకొచ్చినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
మహిళల కళ్లలో ఆనందం కోసమే దీపం పథకం
ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల
తిరుపతి(నేరవిభాగం), నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడిన మహిళల కళ్లలో ఆనందం కోసమే దీపం పథకం తీసుకొచ్చినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలో శనివారం లబ్ధిదారులకు దీపం పథకం కింద మంత్రి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఉచిత సిలిండర్లు బుక్ చేసిన వెంటనే ఇంటి వద్దకు వస్తుందన్నారు. ధర చెల్లించిన 24 గంటల్లోనే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమవుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తామన్నారు. టీడీపీ తిరుపతి పార్లమెంటు ఇన్‌చార్జి నరసింహయాదవ్ మాట్లాడుతూ ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ గత ఐదేళ్ల రాక్షస పాలనలో మహిళలు అభధ్రతా భావంతో బతికారని, ఇప్పుడు స్వేచ్ఛగా ఉంటున్నారని తెలిపారు. జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ మాట్లాడుతూ అర్హత ఉండి ఉచిత సిలిండర్ అందకుంటే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. కమిషనర్ మౌర్య, టీడీపీ తిరుపతి నేత ఆరణి శివ మాట్లాడారు. అనంతరం మంత్రి గ్యాస్ డిస్ర్టిబ్యూషన్ బాయ్స్‌తో ఫొటోలు దిగారు. కార్యక్రమంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్, జనసేన జిల్లా ఇన్‌చార్జి పసుపులేటి హరిప్రసాద్, టీడీపీ అధికార ప్రతినిధి శ్రీధర్ వర్మ, కూటమి నాయకులు ఊకా విజయ్‌కుమార్, కిరణ్‌రాయల్, కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ, రేవతి, నారాయణ, పుష్పావతి, బుల్లెట్ రమణ, ఆముదాల తులసీరాం, సింగం శెట్టి సుబ్బరామయ్య, శ్రీనివాసులు, ఊట్ల సురేంద్ర నాయుడు, అజయ్‌కుమార్, వరప్రసాద్, ఆకేపాటి సులోచన, డీఎస్‌వో శేషాచలం రాజు పాల్గొన్నారు.
Updated Date - Nov 03 , 2024 | 02:22 AM