ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మామండూరులో ఏనుగుల బీభత్సం

ABN, Publish Date - Jun 01 , 2024 | 01:34 AM

రేణిగుంట మండలం మామండూరులోని మామిడితోపుపై రెండు ఏనుగులు పడి బీభత్సం సృష్టించాయి

మామిడితోపులో ఏనుగు

రేణిగుంట, మే 31: రేణిగుంట మండలం మామండూరులోని మామిడితోపుపై రెండు ఏనుగులు పడి బీభత్సం సృష్టించాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. రెండ్రోజుల కిందట ఏనుగుల గుంపు మామిడితోపు సమీపంలో వచ్చి వెళ్లింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం రెండు పెద్ద ఏనుగులు మామిడితోపులోకి ప్రవేశించాయి. చెట్లను విరిచేసి, కాయలు రాల్చేస్తూ బీభత్సం సృష్టించాయి. గ్రామస్తులంతా గుమికూడి పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ.. అతికష్టంపై వాటిని అడవుల్లోకి తరిమేశారు. కాగా, గత నెల 8వ తేదీన కూడా ఏనుగుల గుంపు దాదాపు 60 ఎకరాల్లోని మామిడి చెట్లను ధ్వంసం చేసిందని, ఇప్పటి వరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా పూడిపోయిన కందకాలను బాగుచేసి, ఏనుగుల బారి నుంచి రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Jun 01 , 2024 | 01:34 AM

Advertising
Advertising