ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati transfers అందరికీ తిరుపతే కావాలంట

ABN, Publish Date - Aug 28 , 2024 | 12:58 AM

ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జరుగుతున్న ఉద్యోగుల బదిలీల్లో ఎక్కువ మంది తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేసేందుకు ఇష్టపడుతున్నారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి తిరుపతికి వెళ్లేందుకు పెద్దఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. కానీ, తిరుపతి నుంచి చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు వచ్చేవారు కరువయ్యారు. ఈ సమస్యపై బుధవారం చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు జూమ్‌ కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించనున్నారు.

Tirupati

చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు వచ్చేవారు కరువు

ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జరుగుతున్న ఉద్యోగుల బదిలీల్లో ఎక్కువ మంది తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేసేందుకు ఇష్టపడుతున్నారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి తిరుపతికి వెళ్లేందుకు పెద్దఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. తిరుపతి నుంచి చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు వచ్చేవారు కరువయ్యారు. ఈ సమస్యపై బుధవారం చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు జూమ్‌ కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించనున్నారు.

- చిత్తూరు, ఆంధ్రజ్యోతి


చిత్తూరు జిల్లాలో 43 మంది పంచాయతీ కార్యదర్శులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో తిరుపతికి 31 మంది, అన్నమయ్యకు 12 మంది వెళ్తామని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ విషయానికొస్తే.. డిప్యూటీ తహసీల్దార్లు చిత్తూరు నుంచి తిరుపతికి 8 మంది, అన్నమయ్యకు ముగ్గురు, అన్నమయ్య నుంచి తిరుపతికి ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్వోలు చిత్తూరు నుంచి తిరుపతికి 10 మంది, అన్నమయ్యకు 13 మంది వెళ్తామంటున్నారు. సీనియర్‌ అసిస్టెంట్లు చిత్తూరు నుంచి తిరుపతికి ఐదుగురు, అన్నమయ్య జిల్లాకు ముగ్గురు, అన్నమయ్య నుంచి తిరుపతి ఒకరు వెళ్లాలని దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రస్తుత చిత్తూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలో పనిచేసే వారిలో ఎక్కువ మంది ఇప్పటికీ తిరుపతిలోనే నివాసం ఉంటున్నారు. రోజువారీగా విధులకు వచ్చి వెళుతున్నారు. వీరంతా తిరుపతి జిల్లాకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇలా బదిలీ అవసరమున్న ఉద్యోగులు తమకు పరిచయమున్న కూటమి నేతల ద్వారా ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు సంపాదిస్తున్నారు. అటెండర్ల నుంచి అధికారుల వరకు.. తాము చేసుకున్న దరఖాస్తుకు ఆయా ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల్ని కచ్చితంగా జత చేస్తున్నారు. బదిలీకి అవకాశం లేని వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అధికారులకు అర్థం కావడం లేదు.


మ్యూచ్యువల్‌ ఉంటేనే అనుమతి

తన జిల్లా నుంచి ఒక ఉద్యోగిని కలెక్టర్‌ రిలీవ్‌ చేయాలంటే కచ్చితంగా అదే హోదా కలిగిన వ్యక్తి బయటి నుంచి రావాల్సి ఉంది. అందరూ చిత్తూరు నుంచి వెళ్లిపోతామనే దరఖాస్తులు చేసుకుంటున్నారే తప్ప, జిల్లాకు వస్తామనే దరఖాస్తులు లేవు. అధికారులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో మ్యూచ్యువల్‌ ఉంటేనే బదిలీలను పరిగణనలోకి తీసుకోనున్నారు. అంటే చిత్తూరు నుంచి తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు వెళ్లాలని దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల స్థానంలో అక్కడి నుంచి అదే హోదా కలిగిన ఉద్యోగి చిత్తూరుకు వస్తేనే బదిలీ చేస్తారు. లేకుంటే పరిగణనలోకి తీసుకునే అవకాశాలు తక్కువ. తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి రావాలన్నా ఇదే సూత్రంగా అమలు చేస్తున్నారు.


ఎవరైనా ‘అన్నమయ్య’కు వస్తారా?

అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీలో పనిచేసే ఓ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెక్రటరీ భర్త చిత్తూరు పక్కన తమిళనాడు రాష్ట్రంలో బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె చిత్తూరు చుట్టుపక్కల బదిలీ కోరుతూ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఆమెను చిత్తూరుకు పంపేందుకు అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ సిద్ధంగా లేరు. చిత్తూరు నుంచి అన్నమయ్య జిల్లాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న అదే హోదా కలిగిన ఉద్యోగి కావాలి. చిత్తూరు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ కూడా ‘అలా చిత్తూరు నుంచి అన్నమయ్యకు వెళ్లేవారు ఉంటే చూసుకుని రండి’ అంటూ వారికి సలహా ఇచ్చారు. దీంతో వారు అన్నమయ్య జిల్లాకు మ్యూచ్యువల్‌గా వచ్చే వారున్నారా అంటూ వెతికే పనిలో పడ్డారు.


ఇలాంటి ప్రత్యేక కేసుల్ని పరిగణలోకి తీసుకోవాలి

చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేసే ఓ మహిళా వీఆర్వోకు తిరుపతికి బదిలీ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆమె ఒంటరి మహిళ కావడంతో పాటు తన నాలుగేళ్ల కుమార్తె క్యాన్సర్‌తో బాధ పడుతోంది. తిరుపతిలోని తల్లిదండ్రుల వద్ద కుమార్తెను ఉంచి నిత్యం చిత్తూరుకు వచ్చి వెళ్లడం కష్టంగా మారింది. అదే తిరుపతిలో అయితే కుమార్తె బాగోగులు దగ్గరుండి చూసుకుంటూ ఉద్యోగం చేసుకోవచ్చు. ఆమె తిరుపతికి వెళ్లాలంటే అక్కడి నుంచి చిత్తూరుకు మరో వీఆర్వో రావాలనే నిబంధన ఉంది. తాజా బదిలీ తీరు చూసుకుంటే తిరుపతి నుంచి చిత్తూరుకు వచ్చేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. అందరూ తిరుపతే కావాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వారికి మానవతా దృక్పథంతో అధికారులు న్యాయం చేయాల్సి ఉంది.

Updated Date - Aug 28 , 2024 | 08:48 AM

Advertising
Advertising
<