TTD టీటీడీలో ఇద్దరు అధికారుల డెప్యుటేషన్ పొడిగింపు
ABN, Publish Date - Sep 12 , 2024 | 02:28 AM
టీటీడీలో ఇద్దరు అధికారుల డెప్యుటేషన్ గడువును ప్రభుత్వం పొడిగించింది.రాష్ట్ర సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ ఎ.విజయలక్ష్మి మూడేళ్ళుగా డెప్యుటేషన్‌పై టీటీడీ ఽహిందూ ధర్మ ప్రచార పరిషత్‌లో ప్రాజెక్టు ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు.
తిరుపతి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): టీటీడీలో ఇద్దరు అధికారుల డెప్యుటేషన్ గడువును ప్రభుత్వం పొడిగించింది.రాష్ట్ర సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ ఎ.విజయలక్ష్మి మూడేళ్ళుగా డెప్యుటేషన్‌పై టీటీడీ ఽహిందూ ధర్మ ప్రచార పరిషత్‌లో ప్రాజెక్టు ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు. ఈమె డెప్యుటేషన్ గడువు వచ్చే నెల 7వ తేదీకి ముగియనున్న నేపధ్యంలో మరో ఏడాది పాటు ఆమె డెప్యుటేషన్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.అలాగే డివిజన్ లెవల్ డెవల్‌పమెంట్ ఆఫీసర్ (డీఎల్డీవో) ఎ.ప్రశాంతి కూడా డెప్యుటేషన్‌పై టీటీడీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా గత మూడేళ్ళ నుంచీ కొనసాగుతున్నారు. ఆమె డెప్యుటేషన్ గడువు వచ్చే నెల 24వ తేదీకి ముగియనుండడంతో ప్రభుత్వం మరో ఏడాది పాటు డెప్యుటేషన్ పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.
Updated Date - Sep 12 , 2024 | 07:18 AM