ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పల్లెలకు ‘స్వాతంత్య్రం’

ABN, Publish Date - Aug 11 , 2024 | 01:55 AM

జెండా పండగ కోసం ఐదువేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 10వేలు, అంతకుమించితే రూ.25 వేలను సాధారణ నిధుల నుంచి వాడుకోవడానికి అనుమతి ఇచ్చారు.

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 10 : ఐదువేల జనాభా ఉన్న పంచాయతీలకు రూ.వంద.. అంతకుమించితే 250 రూపాయలు. 34 ఏళ్లుగా జెండా పండుగ కోసం ఈ మొత్తాన్ని మాత్రమే పంచాయతీలు సాధారణ నిధులనుంచి వాడుకునేందుకు అనుమతి ఉంది. ఈ మొత్తాలు త్రివర్ణ పతాకాలు కొనేందుకూ సరిపోని పరిస్థితి. దీంతో మొక్కుబడిగా పంద్రాగస్టు వేడుకలు నిర్వహించి.. సర్పంచులు తమ సొంత డబ్బుతో చాక్లెట్లు తెప్పించి పిల్లలకు పంచేవారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని రీతిలో నిధుల ఖర్చుకు ఆమోదం తెలిపింది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చొరవతో పంచాయతీలకు స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొనేంందుకు వ్యయాన్ని పెంచారు. ఐదువేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 10వేలు, అంతకుమించితే రూ.25 వేలను సాధారణ నిధుల నుంచి వాడుకోవడానికి అనుమతి ఇచ్చారు. జిల్లాలో 5వేల లోపు జనాభా కలిగిన మైనర్‌ పంచాయతీలు 670, అంతకుమించి జనాభా ఉన్నవి 26 చొప్పున 696 పంచాయతీలు ఉన్నాయి. ఈ లెక్కన మైనర్‌ పంచాయతీలకు రూ.67 లక్షలు, మేజర్‌ పంచాయతీలకు రూ.6.50 లక్షలు వెరసి జిల్లాలో రూ.73.50 లక్షల ఖర్చుకు ఆమోదం లభించింది.పంచాయతీల పరిధిలోని ప్రైవేటు పాఠశాలల్లో రాజ్యాంగ విలువలు,స్థానిక సంస్థల పాలన వంటి అంశాలపై వ్యాసరచన, క్విజ్‌, ఆటల పోటీలు, స్వాతంత్య్ర సమరయోధులు, పారిశుధ్య కార్మికులను ఆ రోజు సత్కరిస్తారు. ఈ నిధుల పెంపుపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు జిల్లా పంచాయతీ చాంబర్‌ అధ్యక్షుడు చుక్కా ధనంజయయాదవ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Aug 11 , 2024 | 07:15 AM

Advertising
Advertising
<