passbook-పట్టాదార్ పాసుపుస్తకాలివ్వండి
ABN, Publish Date - Nov 05 , 2024 | 01:20 AM
తమ అనుభవంలో ఉన్న భూములకు పట్టాదార్ పాసుపుస్తకాలను మంజూరు చేయాలని గుడిపాల మండలం నారగల్లు ఎస్టీకాలనీ వాసులు వేడుకున్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎ్‌స)లో జేసీ విద్యాధరికి అర్జీ సమర్పించారు.
- కలెక్టరేట్‌లో జరిగిన ‘పీజీఆర్‌ఎ్‌స’లో బాధితుల వేడుకోలు
చిత్తూరు అర్బన్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): తమ అనుభవంలో ఉన్న భూములకు పట్టాదార్ పాసుపుస్తకాలను మంజూరు చేయాలని గుడిపాల మండలం నారగల్లు ఎస్టీకాలనీ వాసులు వేడుకున్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎ్‌స)లో జేసీ విద్యాధరికి అర్జీ సమర్పించారు. 16 కుటుంబాలకు చెందిన తాము 30 ఏళ్లుగా ప్రభుత్వ భూమిలో రాళ్లు, రప్పలను తొలగించి వ్యవసాయం చేసుకుంటున్నామని చెప్పారు. ఇందులో కొంత భూమిని అగ్రకులస్తులు ఆక్రమించుకున్నారని, న్యాయం చేయాలని కోరారు. అలాగే పెద్ద పంజాణి మండలం శంకరాయలపేట పంచాయతీ నిడివిగుంట లెక్కదాఖలాలో 2.56 ఎకరాల భూమి తన అనుభవంలో ఉందని 2009నుంచి పట్టాదార్ పాసుపుస్తకం ఇవ్వాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని నాగరాజాచారి వాపోయారు. మొత్తం 171 అర్జీలు వచ్చాయి. వీటిల్లో రెవెన్యూశాఖకే 131 అర్జీలు ఉన్నాయి. బాధితుల నుంచి అర్జీలను జేసీతోపాటు పలువురు అధికారులు స్వీకరించారు.
ఫ ఏ జీవనాధారం లేని తమకు గిరిజన కార్పొరేషన్ నుంచి రుణాలను మంజూరు చేయాలని కార్వేటినగరం మండలం కేశవకుప్పం ఎస్టీకాలనీకి చెందిన ఎస్టీలు కోరారు.
ఫ భర్త చనిపోవడంతో జీవనాధారం కష్టమవుతోందని, తనకు వృద్ధాప్య పింఛన్‌ను మంజూరు చేయాలని బంగారుపాళ్యం మండలం జీకేవీ వూరుకు చెందిన లక్ష్మమ్మ కోరారు.
ఫ తన తాత పేరుపై ఉన్న భూమిలో అర్ధభాగంలో తనకు వాటా ఇప్పించి పట్టాదార్‌పాసుపుస్తకాన్ని ఇవ్వాలని చౌడేపల్లె మండలం కాటిపేరికి చెందిన హరి కోరారు. అలాగే ఇదే మండలం కొత్తయిండ్లు గ్రామానికి చెందిన తనకు సర్వే నెంబరు 315-3లో 4.94 ఎకరాల భూమి ఉందని, 1బీని మంజూరు చేయాలని కదిరప్ప కోరారు.
పోలీసు కార్యాలయానికి 22 అర్జీలు
పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 22 అర్జీలు అందాయి. వీటిల్లో చీటింగ్‌పై ఒకటి, కుటుంబ తగాదాలు, వేధింపులపై మూడు చొప్పున, ఇంటి తగాదాలపై రెండు, భూ తగాదాలపై తొమ్మిది, డబ్బు తగాదాలు, ఆస్తి తగాదాలపై రెండు చొప్పున ఉన్నాయి. బాధితుల నుంచి అర్జీలను ఎస్పీ మణికంఠ స్వీకరించారు.
Updated Date - Nov 05 , 2024 | 01:20 AM