ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

flood మనకు వరద వస్తే..?

ABN, Publish Date - Sep 12 , 2024 | 03:02 AM

ఈ ప్రశ్న ఎవరిని అడిగినా ఊరే వంకలోకి వెళ్లిందన్నదే జవాబు. 500 అడుగుల వెడల్పున్న నీవా నది.. చిత్తూరు నగరంలోకి వచ్చేసరికి చిక్కిపోవడమే దీనికి నిదర్శనం. దీనివల్ల పెద్ద వర్షాలకు నదీ పరివాహక ప్రాంతాలు జలమయమవుతున్నాయి. నివాసితులు ఇబ్బంది పడుతున్నారు.

షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద నీవానదిలోనే కట్టిన ఇళ్లు

చిత్తూరుకూ పెద్ద ప్రమాదమే

నీవా నది పరివాహక ప్రాంతాల్లో భారీగా ఆక్రమణలు

నదిలోకి వచ్చిన నిర్మాణాలు

వరద ఊరు మీదకొచ్చిందా? ఊరు నదిలోకి వెళ్లిందా?

ఈ ప్రశ్న ఎవరిని అడిగినా ఊరే వంకలోకి వెళ్లిందన్నదే జవాబు. 500 అడుగుల వెడల్పున్న నీవా నది.. చిత్తూరు నగరంలోకి వచ్చేసరికి చిక్కిపోవడమే దీనికి నిదర్శనం. దీనివల్ల పెద్ద వర్షాలకు నదీ పరివాహక ప్రాంతాలు జలమయమవుతున్నాయి. నివాసితులు ఇబ్బంది పడుతున్నారు. అయినా.. ఆక్రమణలు క్రమేణా పెరుగుతున్నాయే కానీ తగ్గకపోవడం విచారకరం. విజయవాడ వరదను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా స్పందించకుంటే ఎప్పుడో ఒకప్పుడు మనకూ అంతటి ప్రమాదం ఎదురుకాక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- చిత్తూరు

తమిళనాడులోని పరదరామి అటవీప్రాంతంలో ప్రారంభమయ్యే నీవానది యాదమరి, చిత్తూరు మీదుగా ప్రవహిస్తోంది. నగరానికి ప్రధాన నీటివనరుగా.. ప్రజల అవసరాలను తీర్చింది. నగరానికి సంబంధించి ఇరువారం పోతంబట్టు నుంచి దొడ్డిపల్లి వరకు సుమారు ఆరు కి.మీ.ల పొడవున ఉంది. గతంలో దాదాపు 15 చెరువుల అనుసంధానం ఉంది. క్రమేణా నీవానదికి వచ్చే ప్రధాన కాలువలు మూసుకుపోవడంతో ప్రవాహం తగ్గిపోయింది. 30 ఏళ్ల కిందట గలగలా ప్రవహించిన ఈ నది తర్వాత మురుగునీటి ప్రవాహంగా మారిపోయింది. ఇలా ప్రవాహం తగ్గేసరికి పరివాహక ప్రాంతాల ప్రజలు క్రమంగా నదిని ఆనుకొని ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. నగరపాలక సంస్థ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా భవనాలను నిర్మించారు. దీంతో నది వెడల్పు 500 నుంచి వంద అడుగులకు కుచించుకుపోయింది. నీవానదిలో అక్రమంగా నిర్మించిన ఇళ్ళకు ప్రమాదాలు లేకపోలేదు. వరదలు వచ్చిన సందర్భాల్లో ఈ నది ఉప్పొంగుతుంది. 2017లో కురిసిన వర్షాలకు నీవానదిలోకి వరదనీరు చేరింది. ఇక, 2020లో నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో వరద ఉధృతికి నీవానది పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి. తోటపాళ్యం, కైలాసపురం, వీరభద్రకాలనీ, రంగాచ్చారి వీధి, పోతంబట్టు, తేనబండ, ఆటోనగర్‌, రిక్షాకాలనీ, గంగనపల్లి తదితర ప్రాంతాలు నీట మునిగాయి. నిరాశ్రయులకు వారం రోజులపాటు నగరంలోని 16 ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరద సమయంలో పేరుకుపోయిన బురద, మట్టిని తొలగించడానికి పది రోజులు పట్టింది. సకాలంలో అధికారులు స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ, ఆస్తి నష్టం వాటిల్లింది. వారం పాటు అక్కడి ప్రజలు పునరావాస కేంద్రాల్లో ఉండాల్సి వచ్చింది.

ప్రతిపాదనలకే ప్రహరీ

నివర్‌ తుఫాన్‌ సందర్భంగా సుమారు 15 కాలనీలు నీట మునిగాయి. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తదితరులు ముంపు ప్రాంతాలను పరిశీలించారు. నీవానదిలో ఆక్రమణలను నివారించడంతో పాటు నదికి రెండువైపులా 10- 12 అడుగుల మేర ఆరు కిలోమీటర్ల మేర రిటైన్‌ వాల్‌ నిర్మాణానికి రూ.112 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. అక్కడితో సరి.

ఇప్పటికైనా కళ్లు తెరవకుంటే..

నీవానది పరిసరాల్లో ఇళ్ల నిర్మాణాలను అప్పట్లో నగరపాలక సంస్థ అధికారులు ధ్వంసం చేశారు. ఇక్కడ నిర్మాణాలు సురక్షితం కాదని చెప్పినా వినిపించుకోని కారణంగా వారి నిర్మాణాలను సైతం కూలదోసేశారు. ఆ తర్వాత అక్రమ నిర్మాణాలను పట్టించుకోలేదు. నీవానదికి పెద్ద వరద రాలేదు కదా అని నిర్లక్ష్యంగా ఉంటున్నారు. విజయవాడలోని బుడమేరు విషయంలోనూ అక్కడి ప్రజలు అలాగే భావించారు. కానీ, ఇప్పుడు ఉన్నట్లుండి వచ్చిన పెద్ద వరద ఎంతటి ప్రమాదాన్ని తెచ్చిందో చూశాం. చిత్తూరులోనూ ఇప్పటికైనా కళ్లు తెరవకుంటే ఎప్పటికైనా ప్రమాదం పొంచే ఉంటుంది.

గంగనపల్లె శివారులో 500 అడుగుల వరకున్న నీవానదిని ఆక్రమణదారులు పూడ్చేసి లే అవుట్లు వేసి సొమ్ము చేసుకున్నారు. వంక మధ్యలో సిమెంటు రోడ్డు వేశారు. నగరంలోని వ్యర్థాలను తీసుకొచ్చి రోడ్డుకు అవతల వంకను పూడ్చుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఇళ్లను కట్టుకున్నారు. ఇళ్లు, లే అవుట్ల స్థలం పోను ప్రస్తుతం అక్కడ 30 నుంచి 40 అడుగుల వరకు మాత్రమే నీవానది కనిపిస్తోంది. ఇలాగైతే వరదొస్తే పొంగదా? ఇళ్లు జలమయం కావా?

నగరంలోని కార్మికులంతా వీరభద్రకాలనీ, రిక్షా కాలనీల్లోనే ఉంటున్నారు. 2022లో కురిసిన భారీ వర్షానికి నీవానది పొంగి ప్రవహించింది. దీంతో ఈ రెండు కాలనీలతో పాటు నీవానది పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. అధికారులంతా కాలనీలను సందర్శించి అక్కడి వారిని ఇతర ప్రాంతాలకు తరలించారు. వారం రోజుల పాటు ఆశ్రయం కల్పించి పంపించారు. చిన్నపాటి వర్షం కురిసినా ఇళ్లల్లోకి నీళ్లు వస్తుండటంతో ప్రతిసారి కన్నీటి కష్టాలు తప్పడం లేదు. వంకలో ఇళ్లు కట్టుకోవడం వల్ల ఎప్పటికైనా ప్రమాదమేనని, ఇక్కడి వారికి ప్రశాంత్‌నగర్‌లో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పినా స్థానికులు వెళ్లలేదు.

సంతపేట వద్ద నీవానదిపై లిల్లీ బ్రిడ్జిని కట్టారు. ఈ బ్రిడ్జికి కుడి, ఎడమ వైపుల 30 అడుగల వరకు వదిలేసి మిగిలిన స్థలాన్ని ఆక్రమించుకుని పలువురు ఇళ్లు కట్టేశారు. వర్షాలు వచ్చినప్పుడు హడావుడి చేసే నగరపాలక సంస్థ అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడంలేదు. దాంతో ఆక్రమణదారులు వంక స్థలాన్ని యథేచ్ఛగా ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలను కట్టుకుంటున్నారు.

నీవానదిని ఆనుకుని లాయర్స్‌ కాలనీ ఉంది. వంక పక్కన నిర్మిస్తున్న ఇళ్లను ముందుకు జరిపి వంక స్థలాన్ని ఆక్రమిస్తున్నారు. ఇలా కాలనీ పొడవునా సుమారు 50 నుంచి వంద అడుగుల వరకు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు.

Updated Date - Sep 12 , 2024 | 03:02 AM

Advertising
Advertising