ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పంటలపై ఆగని గజదాడులు

ABN, Publish Date - Oct 28 , 2024 | 01:15 AM

చాకిరేవు వంకలో మాటువేసిన ఏనుగుల గుంపు

పులిచెర్ల మండలం వైపు వస్తున్న ఏనుగుల గుంపు

కల్లూరు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలంలో పంటలపై ఏనుగుల గుంపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పాళెం, పాతపేట, ఆవులపెద్దిరెడ్డిగారిపల్లె పంచాయతీల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం వేకువజాము వరకు ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేసింది. ముందుగా పాళెంలోని చలపతికి చెందిన అర ఎకరా వరి, సోమశేఖర్‌కు చెందిన అర ఎకరా టమోటా పంటను నాశనం చేశాయి. అక్కడినుంచి ఆవులపెద్దిరెడ్డిగారిపల్లె సమీపానికి చేరుకుని నాగరాజుకు చెందిన అర ఎకరా వరిని తొక్కేశాయి. తర్వాత పాతపేట పంచాయతీ పూరేడువారిపల్లె వద్దకెళ్లి సత్యనారాయణకు చెందిన 50 అరటిచెట్లు, 10 కొబ్బరిచెట్లు, పశుగ్రాసం, వాసుకు చెందిన అర ఎకరా వరిని ధ్వంసం చేశాయి. కల్లూరులోని శ్రీనివాసులుకు చెందిన 5 మామిడిచెట్లు, రైతు మురళికి చెందిన 3 కొబ్బరిచెట్లను విరిచేశాయి. పాతపేట సమీపంలోని చాకిరేవు వంక వద్దకు చేరుకుని పగలంతా తిష్ఠ వేశాయి. ఈ ఏనుగుల గుంపును సదుం మండలం మీదుగా పలమనేరు కౌండిన్య అడవివైపు మళ్లించాలని ఎఫ్‌ఆర్‌వోలు థామస్‌ సుకుమార్‌, బాలకృష్ణారెడ్డి, డిప్యూటీ రేంజర్‌ కుప్పుస్వామి, ఎఫ్‌ఎ్‌సవో షఫి, ఎఫ్‌బీవోలు మున్నా, శ్రీదేవి తమ సిబ్బందితో ప్రయత్నం చేశారు. అయితే సాయంత్రానికి మళ్లీ పులిచెర్ల మండలం వైపు అడుగుల వేశాయి. అటవీశాఖ అధికారులు టపాకాయలు కాల్చినా రాత్రి ఏడు గంటల సమయానికి కల్లూరు సమీపంలోని ఎద్దలవారిపల్లె వద్దకు చేరుకున్నాయి. కల్లూరు సమీపానికి ఏనుగుల గుంపు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా ఈ రాత్రికి పాళెం పంచాయతీ సమీపంలోని తూర్పు అటవీ విభాగంలోకి ఏనుగుల గుంపును రానీయకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Updated Date - Oct 28 , 2024 | 01:15 AM