ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TTD: తిరుమల నడక దారి భక్తుల భద్రతపై.. హైకోర్టులో విచారణ

ABN, Publish Date - Mar 13 , 2024 | 07:22 PM

తిరుమల(Tirumala) అలిపిరి నడక దారిలో వన్యమృగాల సంచారం పెరగడం.. మనుషులపై దాడులు పెరుగుతుండటంతో నడకదారి భక్తుల భద్రతా చర్యలపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.

అమరావతి: తిరుమల(Tirumala) అలిపిరి నడక దారిలో వన్యమృగాల సంచారం పెరగడం.. మనుషులపై దాడులు పెరుగుతుండటంతో నడకదారి భక్తుల భద్రతా చర్యలపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. వన్యమృగాలతో భక్తులు ప్రమాదాలకు గురవుతున్నారని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు. సరైన భద్రతా చర్యలు పాటించట్లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది యలమంజుల బాలాజీ వాదించారు.

టీటీడీ తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. మంగళవారం ఫారెస్ట్, వైల్డ్ లైన్ ఇండియా అధికారులతో సమావేశం నిర్వహించామన్నారు. నడకమార్గంలో భూసేకరణ ప్రక్రియ చేపడుతున్నామని చెప్పారు. భక్తుల రక్షణ కోసం చేపట్టిన చర్యలను ఏప్రిల్ మొదటి వారంలో తెలియజేస్తామన్నారు. వాదనలు విన్న కోర్టు కేసు తదుపరి విచారణను ఏప్రిల్ రెండో వారానికి వాయిదా వేసింది.

Updated Date - Mar 13 , 2024 | 07:25 PM

Advertising
Advertising