ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డీసీసీబీ అక్రమాలపై నత్తనడకన విచారణ

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:05 AM

చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ నత్తనడకన సాగుతోంది.

చిత్తూరు కలెక్టరేట్‌/ చిత్తూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి):చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ నత్తనడకన సాగుతోంది.డీసీసీబీలో అక్రమాల గురించి జూలై 11, 12 తేదీల్లో ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రచురితం కావడం, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు వీటిపై ఓ నోట్‌ సిద్ధం చేసి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. అక్టోబరు 10 తేదీన డీసీసీబీ అక్రమాలపై విచారణకు ఆదేశించింది. రెండుమూడు వారాల్లో విచారణ పూర్తి చేసి నివేదిక అందిస్తామన్న అధికారులు ఇప్పటికీ ఆ పని చేయలేదు.గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలకు అడ్డగోలుగా రుణాలు మంజూరు చేసిన డీసీసీబీ అధికారులను కాపాడడం కోసం వారి వెంటబడి మరీ అప్పులు వసూలు చేయిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి సిఫార్సు మేరకు బైరెడ్డిపల్లెకు చెందిన జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ రెడ్డెమ్మను డీసీసీబీ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. ఈమె హయాంలోనే అప్పటి పాలకవర్గం నిబంధనలకు విరుద్ధంగా జిల్లావ్యాప్తంగా వైసీపీ నాయకులకు రూ.కోట్లలో రుణాలు మంజూరయ్యాయి. ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలతో స్పందించిన సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. అక్టోబరు 10వ తేదీన సహకార శాఖ కమిషనర్‌ విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని జిల్లా సహకార శాఖ అధికారిణి నాగవర్ధిణిని ఆదేశించారు.ఈ నేపథ్యంలో గత నెల 15వ తేదీనే విచారణ బృందం ఏర్పాటైంది. డీసీవో నాగవర్ధిణి ఆధ్వర్యంలోని ఈ బృందంలో చిత్తూరు డీఎల్‌సీవో వనజ, డీసీఏవో బ్రహ్మానందరెడ్డితో పాటు 12 మంది కోఆపరేటివ్‌ సీనియర్‌ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.జిల్లా కేంద్రంలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంతో పాటు 12 శాఖల్లో సుమారు రెండు వారాలుగా విచారణ జరుపుతున్నారు.నిజానికి ఎమ్మెల్సీ దొరబాబు డీసీసీబీలో జరిగిన అక్రమాల గురించి పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఏయే శాఖల్లో ఏ వైసీపీ నాయకుడు ఎంత మేరకు రుణాలు తీసుకున్నారనే సమగ్ర వివరాలు అందులో ఉన్నాయి. అవన్నీ నిజమని అధికారులకూ తెలుసు.అందుకే రుణాలు తీసుకున్న వైసీపీ నాయకుల నుంచి బకాయిల్ని వసూలు చేసే పనిలో పడ్డారు. అక్రమ రుణాలు తీసుకున్న వారి వెంటపడి బ్రాంచి మేనేజర్లు వసూలు చేస్తున్నారు.రుణాలు తీసుకున్నవారే కాదు... మంజూరు చేసినవారు కూడా ఇబ్బంది పడాల్సివస్తుందన్న భయంతో నేతల వెంటబడుతున్నారు.అక్రమాల గురించి నివేదిక సమర్పించాల్సిన అధికారులు విచారణ నత్తనడకన సాగిస్తూ వారికి సహకరిస్తున్నారు.

రూ.కోటి రుణాలు వసూలు

డీసీసీబీ కేంద్ర కార్యాలయంతో పాటు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్న 12 శాఖల్లో మేనేజర్లు రుణాల్ని రికవరీ చేస్తుండగా.. ఇప్పటివరకు రూ.కోటి వసూలైనట్లు సమాచారం. డీసీసీబీ ఛైర్‌పర్సన్‌ రెడ్డెమ్మ భర్త తమ్ముడు రెడ్డెప్ప 2023లో వి.కోట బ్రాంచిలో రూ.40 లక్షల రుణాన్ని ఇంటి నిర్మాణం కోసం తీసుకున్నారు. తాజాగా ఆయన వడ్డీతో కలిపి రూ.45 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా రెడ్డమ్మకు పీఏగా పనిచేసిన జడ్పీ ఉద్యోగి సుధాకర్‌ గిరింపేట, శ్రీకాళహస్తి బ్రాంచుల్లో రుణాలు తీసుకున్నారు. గిరింపేట బ్రాంచిలోని రుణాన్ని వడ్డీ సహా రూ.5 లక్షలు చెల్లించారు.మిగిలిన శాఖల్లో కూడా మరో రూ.50 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం.

ఉద్యోగ నియమకాల్లో అక్రమాలు

జిల్లాలోని వైసీపీ నాయకులకు నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ.10 కోట్ల వరకు రుణాలు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. విచారణ జరుగుతుండడంతో హడావిడిగా కొందరు మాత్రం చెల్లించారు. వి.కోట, మదనపల్లె, పలమనేరు, బైరెడ్డిపల్లె, పుంగనూరు తదితర బ్యాంకు శాఖల్లో వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలు రూ.40 లక్షలకు మించి నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేశారు. ఓ కుటుంబంలో ఒకరికే రుణమివ్వాల్సి వుండగా వి.కోటలో ఒకే ఇంట్లోని ఐదుగురికి రూ.40 లక్షల చొప్పున రుణాలు మంజూరు చేశారు. చాలా శాఖల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే 2022లో జరిగిన ఉద్యోగ నియామకాల్లో అక్రమాలపై బాధితులు గగ్గోలు పెడుతున్నారు.సొసైటీ ఉద్యోగులకు 25 శాతం ఉద్యోగాలు కేటాయించాల్సివుండగా ఆ మేరకు మంజూరైన 50 పోస్టుల్లో 12 ఉద్యోగాలకు ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల మేర వసూలు చేసినట్లు సమాచారం. ఉద్యోగ అవకాశాలు ఇస్తామని మరికొందరు సొసైటీ ఉద్యోగుల నుంచి కూడా కొంత మొత్తాన్ని వసూలు చేసి ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో.. బాధితులు పాలకవర్గం, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:05 AM