ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ విషాద ఘటనకు 15 ఏళ్లు

ABN, Publish Date - Oct 31 , 2024 | 01:34 AM

దీపావళి వస్తే అందరి ఇళ్లలో ఆనందపు వెలుగులే. అయితే సరిగ్గా 15 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లా సరిహద్దులోని పళ్లిపట్టులో దీపావళి రోజు జరిగిన ఘటన కొందరి ఇళ్లలో చీకటి నింపింది.ఇప్పటికీ దీపావళి వచ్చిందంటే ఆ కుటుంబాలతో పాటు వారి బంధువులు, స్నేహితులు కూడా ఆ దుర్ఘటనను గుర్తు చేసుకుని బాధపడుతుంటారు.

వెదురుకుప్పం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): దీపావళి వస్తే అందరి ఇళ్లలో ఆనందపు వెలుగులే. అయితే సరిగ్గా 15 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లా సరిహద్దులోని పళ్లిపట్టులో దీపావళి రోజు జరిగిన ఘటన కొందరి ఇళ్లలో చీకటి నింపింది.ఇప్పటికీ దీపావళి వచ్చిందంటే ఆ కుటుంబాలతో పాటు వారి బంధువులు, స్నేహితులు కూడా ఆ దుర్ఘటనను గుర్తు చేసుకుని బాధపడుతుంటారు.తమిళనాడులోని పళ్లిపట్టు టపాసులకు ప్రసిద్ధి. చౌకగా దొరుకుతాయని అక్కడికి చిత్తూరు జిల్లావాసులు కూడా వెళ్తుంటారు.2009వ సంవత్సరం అక్టోబరు 16వ తేది రాత్రి పళ్లిపట్టు టపాసుల గోడౌన్‌లో కొనుగోలుదారులు అధిక సంఖ్యలో ఉండగా అగ్నిప్రమాదం జరిగింది. దీంతో టపాసులు, నల్లమందు పేలి మంటలు వ్యాపించాయి.ఈ ఘటనలో 32 మంది మరణించారు. వీరిలో కార్వేటినగరం మండలానికి చెందిన ఆరుగురు, ఎస్‌ఆర్‌పురం, పుత్తూరు తదితర ప్రాంతాలకు చెందిన 12మంది చనిపోయారు.

Updated Date - Oct 31 , 2024 | 06:56 AM