ధనార్జన క్షేత్రంగా మార్చారు
ABN, Publish Date - Nov 17 , 2024 | 02:15 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో పవిత్రమైన ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చి దోచుకున్నారని టీటీడీ సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి ఆరోపించారు.
10 శాతం కమీషన్ కోసం రూ.500 కోట్ల శ్రీవారి నిధుల దుర్వినియోగం
టీటీడీ సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి
తిరుపతి(ఉపాధ్యాయనగర్), నవంబరు 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో పవిత్రమైన ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చి దోచుకున్నారని టీటీడీ సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన బీజేపీ నాయకులతో కలిసి నిర్మాణంలో ఉన్న టీటీడీ గోవిందరాజుల సత్రాలను పరిశీలించారు. 2016లో రూ.10 కోట్లు వెచ్చించి మరమ్మతులు చేసిన సత్రాలను ఇప్పుడు మళ్లీ తిరిగి నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. శ్రీవారి నిధులను కాజేసేందుకే గత ప్రభుత్వ పెద్దలు ఈ నిర్మాణాలను ప్రారంభించారని అనుమానం వ్యక్తం చేశారు. నూతన భవన నిర్మాణాల పేరుతో రూ.500 కోట్ల శ్రీవారి నిధులను దోచుకుతిన్నారని దుయ్యబట్టారు. శ్రీవారిపై భక్తితో భక్తులు సమర్పించిన కానుకలను కమీషన్ల పేరుతో కాజేసేందుకే వైసీపీ నేతలు ఈ నిర్మాణ పన్నాగం పన్నారన్నారు. 2019 నుంచి 2024 వరకు టీటీడీలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై టీటీడీ చైర్మన్‌తో చర్చించి, ఆయన అనుమతితో ఒక కమిటీ వేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి పొనగంటి భాస్కర్, తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ అజయ్ కమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, నాయకులు సుబ్బు యాదవ్, జీవన్ రాయల్ తదితరలు పాల్గొన్నారు.
Updated Date - Nov 17 , 2024 | 02:15 AM