ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కారుకు నిప్పు పెట్టింది వైసీపీ కార్యకర్తలే

ABN, Publish Date - Jul 23 , 2024 | 01:47 AM

పుంగనూరులో ఆదివారం అర్ధరాత్రి తన కారును వైసీపీ కార్యకర్తలే కాల్చేశారంటూ టీడీపీ మైనార్టీ నాయకుడు షేక్‌ నదీమ్‌ సోమవారం ఎస్‌ఐ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు.

ఎస్‌ఐ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేస్తున్న బాధితుడు నదీమ్‌

ఫ పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

పుంగనూరు, జూలై 22: పుంగనూరులో ఆదివారం అర్ధరాత్రి తన కారును వైసీపీ కార్యకర్తలే కాల్చేశారంటూ టీడీపీ మైనార్టీ నాయకుడు షేక్‌ నదీమ్‌ సోమవారం ఎస్‌ఐ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇటీవల మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటి వద్ద జరిగిన అల్లర్లలో కారు దహనమైన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆస్తులు, వాహనాలు కాల్చడంతోపాటు ప్రాణాలు తీయాలన్న వైసీపీ నాయకులు ప్రోత్సాహంతోనే ఈ ఘటన జరిగిందన్నారు. వైసీపీ కార్యకర్తలు లడ్డు, మున్నా కలసి పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారని ఫిర్యాదు పేర్కొన్నారు. సమీపంలోని వారు గట్టిగా కేకలు వేసి నిద్రపోతున్న తమను లేపడంతో ఏమి జరిగిందని చూడగా కారులో నుంచి మంటలు వస్తున్నాయన్నారు. తామంతా కలిసి నీరు పోసి మంటలు అదుపు చేశామని వివరించారు. తన కారుపై ఖాళీ పెట్రోల్‌ బాటిళ్లు ఉన్నాయని తెలిపారు. ఈమేరకు హెడ్‌కానిస్టేబుల్‌ కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీ్‌సస్టేషన్‌లో ప్రముఖ న్యాయవాది బి.వెంకటముని యాదవ్‌, మైనార్టీనేత సుహేల్‌బాషాలతో వెళ్లి ఘటన గురించి పోలీసులకు వివరించి ఫిర్యాదు చేశారు.

రెచ్చగొడుతున్న వైసీపీ నేతలు: టీడీనీ

‘ప్రశాంతంగా ఉన్న పుంగనూరులో వైసీపీ నాయకులు కావాలనే అల్లర్లు సృష్టిస్తున్నారు. టీడీపీ శ్రేణులు ప్రశాంత వాతావరణంలో జీవించాలని ఉంటే వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటి వద్ద జరిగిన ఘర్షణలో కొందరి వ్యక్తుల పేర్లు నమోదు చేశారంటూ అనుమానంతో వైసీపీ కార్యకర్తలు నదీమ్‌ కారు కాల్చారు’ అంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. సమావేశంలో టీడీపీ నాయకులు సద్దాం హుస్సేన్‌, సుబ్బన్న, దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2024 | 01:47 AM

Advertising
Advertising
<