Vigilance విజిలెన్సు ఎస్పీగా కరీముల్లా షరీఫ్
ABN, Publish Date - Sep 05 , 2024 | 01:18 AM
తిరుపతి విజిలెన్సు ఎస్పీగా విజయవాడలో పనిచేస్తున్న కరీముల్లా షరీ్‌ఫ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన తిరుపతిలో ఇన్‌చార్జి ఎస్పీగా పనిచేస్తున్నారు.
తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 4: తిరుపతి విజిలెన్సు ఎస్పీగా విజయవాడలో పనిచేస్తున్న కరీముల్లా షరీ్‌ఫ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన తిరుపతిలో ఇన్‌చార్జి ఎస్పీగా పనిచేస్తున్నారు. 2010 బ్యాచ్‌కు చెందిన కరీముల్లా షరీఫ్ అనంతపురం జిల్లా కదిరి డీఎస్పీగా పని చేశాక గ్రేహౌండ్స్‌కు బదిలీ అయ్యారు.తర్వాత కడప జిల్లా మైదుకూరు,అనంతపురం జిల్లా పెనుకొండల్లో డీఎస్పీగా పనిచేసిన ఆయన సీఐడీకి బదిలీ అయ్యారు.2018లో అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించిన ప్రభుత్వం ఇంటెలిజెన్సు విభాగానికి బదిలీ చేసింది. అనంతరం పశ్చిమ గోదావరి సెబ్ అదనపు ఎస్పీగా నియమించింది. తరువాత విజయవాడ ఇంటెలిజెన్సు విభాగానికి బదిలీ చేసారు. 2023లో ఎస్పీగా పదోన్నతిపై విజయవాడలోని విజిలెన్సు విభాగంలో ఎనిమిది నెలలు పనిచేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలోని వివిధ విభాగాల్లో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీసేందుకు ఆయన్ను విచారణాఽధికారిగా నియమించింది. ఈ క్రమంలో ప్రస్తుతం తిరుపతి విజిలెన్సు విభాగానికి ఇన్‌చార్జి ఎస్పీగా పనిచేస్తున్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన విజిలెన్సు ఎస్పీల బదిలీల్లో కరీముల్లా షరీ్‌ఫను తిరుపతి ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
Updated Date - Sep 05 , 2024 | 08:51 AM