ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GameZone-శిల్పారామంలో గేమ్‌జోన్‌కు తాళం

ABN, Publish Date - Nov 05 , 2024 | 01:41 AM

తిరుపతి- తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో గేమ్‌జోన్‌కు తాళం పడింది. ఆదివారం సాయంత్రం క్రాస్‌వీల్‌లో సీటు విరిగి 20 కింద పడటంతో లోకేశ్వరి మృతిచెందగా, గౌతమి గాయపడిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతున్న గౌతమి పరిస్థితి విషమంగా ఉంది.

- విషమంగా గౌతమి ఆరోగ్యం

తిరుచానూరు, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): తిరుపతి- తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో గేమ్‌జోన్‌కు తాళం పడింది. ఆదివారం సాయంత్రం క్రాస్‌వీల్‌లో సీటు విరిగి 20 కింద పడటంతో లోకేశ్వరి మృతిచెందగా, గౌతమి గాయపడిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతున్న గౌతమి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై శిల్పారామం సంస్థల సీఈవో స్వామినాయుడు ఇక్కడి ఏవో ఖాదరవల్లితో మాట్లాడారు. ఫిట్‌నె్‌సపై నిర్లక్ష్యంగా ఎందుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. శిల్పారామంలోని గేమ్‌జోన్‌లోని ఆటవస్తువుల ఫిట్‌నె్‌సపై దృష్టి సారించాలన్నారు. సక్రమంగా ఉంటేనే తిరిగి గేమ్‌ జోన్‌ను పునరుద్ధరించాలని సూచించారు. ఘటనపై విచారణ చేయనున్నట్లు తెలిసింది. కాగా, క్రాస్‌ వీల్‌ కాంట్రాక్టర్‌ ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Updated Date - Nov 05 , 2024 | 08:40 AM