ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముప్పు అని తెలిసినా తలకెక్కడం లేదు

ABN, Publish Date - Dec 17 , 2024 | 02:20 AM

ద్విచక్ర వాహనదారుల నిర్లక్ష్యం.. అతివేగం.. రోడ్డు ప్రమాదాలకు ఎక్కువగా కారణమవుతున్నాయి. వందలాది మంది అసువులు బాస్తున్నారు. మృతుల సంఖ్య పెరగడానికి హెల్మెట్‌ ధరించకపోవడం ప్రధాన కారణంగా పోలీసు లెక్కలు చెబుతున్నాయి.90శాతానికి పైగా హెల్మెట్‌ ధరించడం లేదు.ద్విచక్ర వాహనాలను రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసేవారు, రూ.వెయ్యి లోపు ఖర్చయ్యే హెల్మెట్లను కొనుగోలు చేసేందుకు మాత్రం వెనకాడుతుంటారు. ఒకవేళ కొనుగోలు చేసినా ధరించడం లేదు. వారంతా హెల్మెట్‌ ధరించేలా అవగాహన కల్పించడంలో రవాణా,పోలీసు అధికారులు విఫలమయ్యారు.

చిత్తూరు గాంధీ సర్కిల్‌ వద్ద యువత నిర్లక్ష్యపు డ్రైవింగ్‌

హెల్మెట్‌ లేకుంటే ప్రాణాపాయమే

ఆరు నెలల్లో 51మంది మృత్యువాత

ద్విచక్ర వాహనదారుల నిర్లక్ష్యం.. అతివేగం.. రోడ్డు ప్రమాదాలకు ఎక్కువగా కారణమవుతున్నాయి. వందలాది మంది అసువులు బాస్తున్నారు. మృతుల సంఖ్య పెరగడానికి హెల్మెట్‌ ధరించకపోవడం ప్రధాన కారణంగా పోలీసు లెక్కలు చెబుతున్నాయి.90శాతానికి పైగా హెల్మెట్‌ ధరించడం లేదు.ద్విచక్ర వాహనాలను రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసేవారు, రూ.వెయ్యి లోపు ఖర్చయ్యే హెల్మెట్లను కొనుగోలు చేసేందుకు మాత్రం వెనకాడుతుంటారు. ఒకవేళ కొనుగోలు చేసినా ధరించడం లేదు. వారంతా హెల్మెట్‌ ధరించేలా అవగాహన కల్పించడంలో రవాణా,పోలీసు అధికారులు విఫలమయ్యారు.

-చిత్తూరు, ఆంధ్రజ్యోతి

ఫ చిత్తూరు నగరం గోకులంవీధికి చెందిన శ్రీహరి, వినీత దంపతుల ఒక్కగానొక్క కుమారుడు రాహుల్‌ సీతమ్స్‌ కాలేజీలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదివేవాడు. తల్లిదండ్రులు గారాబంతో రూ.3.20 లక్షలు విలువ చేసే బైక్‌ను 2022 జూన్‌ 1వ తేదీన కొనిచ్చారు. పది రోజులకే కాలేజీ నుంచి వెనుక స్నేహితుడ్ని కూర్చొబెట్టుకుని రాహుల్‌ బైక్‌పై బయల్దేరాడు. కాలేజీ నుంచి మురకంబట్టు వైపు ప్రయాణిస్తుండగా.. రోడ్డుపైనున్న ఇసుకలో బైక్‌ స్కిడ్‌ కావడంతో ప్రమాదం జరిగింది. ఇద్దరూ రోడ్డు పక్కనున్న రాళ్ల మీద పడడంతో తలలకు గాయాలై అక్కడికక్కడే మరణించారు. హెల్మెట్లు ధరించి ఉంటే బతికేవారు.

ఫ గతేడాది సెప్టెంబరు 10వ తేదీన.. కార్వేటినగరం కొల్లాగుంట కొత్త దళితవాడకు చెందిన కె.రాజా (50) తన పొలానికి నీరు పారించేందుకు బయల్దేరాడు. పళ్లిపట్టు నుంచి వెళ్తున్న కారు పడివేటమ్మ ఆలయం వద్ద రాజా ప్రయాణిస్తున్న స్కూటర్‌ను ఢీకొంది. రాజా తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. హెల్మెట్‌ ఉంటే ప్రాణాలు దక్కేవి.

ఫకాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలు గాయపడినా బతకవచ్చు, కానీ తలకు గాయమైతే ప్రాణానికి ముప్పు తప్పదు. ద్విచక్ర వాహనాలను నడపడంలో తాము నేర్పరులమని, హెల్మెట్లు అవసరం లేదని కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. మరికొందరు దాన్ని అడ్డంకిగా భావిస్తుంటారు. మొత్తమ్మీద హెల్మెట్లను ధరించాలంటే ఎక్కువమంది ఆసక్తి చూపడం లేదు. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

ఫ జిల్లాలో హెల్మెట్లు ధరించక

మరణించినవారి వివరాలు

నెల మృతులు

జూన్‌ 7

జూలై 9

ఆగస్టు 9

సెప్టెంబరు 13

అక్టోబరు 5

నవంబరు 7

డిసెంబరు 15వరకూ 1

మొత్తం 51

పట్టణాల్లో ఇబ్బందులు..

అప్పుడప్పుడూ పోలీసులు నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన సర్కిళ్లలో తనిఖీలు చేస్తుంటారు. వాస్తవానికి పట్టణాల్లో ద్విచక్ర వాహనాలు వేగంగా వెళ్లే అవకాశం ఉండదు. హైవేల్లో మాత్రం శృతిమించిన వేగంతో ప్రయాణిస్తుంటారు, ప్రమాదాలు జరిగితే ప్రాణాలు కోల్పోతుంటారు. జిల్లాలో హెల్మెట్‌ లేక మరణించిన ఘటనలన్నీ హైవేల్లో చోటు చేసుకున్నవే.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పైనే దృష్టి

యువకులు మరీ నిర్లక్ష్యంగా బైక్‌ రైడింగు చేస్తున్నారు. సైలెన్సర్లను తొలగించి పెద్ద శబ్దాలతో డ్రైవ్‌ చేస్తుంటారు. మరికొందరు సెల్‌ఫోన్లో మాట్లాడుతూ మెడ ఒక వైపు వంచుకుని డ్రైవ్‌ చేస్తుంటారు. అలా చేయడంతో వారితో పాటు పక్కన ప్రయాణించేవారికీ ఇబ్బందులు తప్పడం లేదు. చిత్తూరులో ట్రాఫిక్‌ పోలీసులు సీఐ నిత్యబాబు ఆధ్వర్యంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలను నిత్యం నిర్వహిస్తున్నారు. రూ.10 వేల చొప్పున జరిమానా విధించి, కేసులు పెడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, హెల్మెట్ల విషయంలో దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నగరంలో ప్రధాన కూడళ్లలో కాకుండా నగర బయటి ప్రాంతాల్లో తనిఖీలు పెంచాల్సిన అవసరముంది.

Updated Date - Dec 17 , 2024 | 02:20 AM