కుప్పం దాహం తీరుతోంది!
ABN, Publish Date - Nov 20 , 2024 | 01:50 AM
అయిదేళ్లపాటు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన కుప్పం నియోజకవర్గం తేరుకోవడం ప్రారంభమైంది. వైసీపీ పాలననాటి వివక్షాపూరిత వైఖరినుంచి బయటకు వచ్చి టీడీపీ పాలనలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపుగా పరుగులు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరవడమే కాక, ఆయా నిధులతో పనులు కూడా ప్రారంభమై కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవడం మొదలైంది.
అయిదేళ్లపాటు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన కుప్పం నియోజకవర్గం తేరుకోవడం ప్రారంభమైంది. వైసీపీ పాలననాటి వివక్షాపూరిత వైఖరినుంచి బయటకు వచ్చి టీడీపీ పాలనలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపుగా పరుగులు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరవడమే కాక, ఆయా నిధులతో పనులు కూడా ప్రారంభమై కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవడం మొదలైంది.
కుప్పం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కుప్పం నియోజకవర్గాన్ని యేటా వర్షాభావం పట్టి పీడిస్తుంటుంది.సాధారణ వర్షపాతంకంటే చాలా తక్కువగా వానలు కురుస్తుండడంతో నిత్యం గ్రామాలు తాగునీటి ఎద్దడితో అల్లాడుతుంటాయి.ఏడాదిగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గ్రామాలు క్రమేణా తాగునీటి ఎద్దడి సమస్యలోకి జారుతున్నాయి. గత వైసీపీ హయాంలో తాగునీటి ఎద్దడి నివారణకు పరిష్కారంగా చాలా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. అంతకుముందు 2014-2019 మధ్యకాలంలో టీడీపీ హయాంలో సరఫరా చేసిన తాగునీటి ట్యాంకర్లకు బిల్లుల చెల్లింపులతోపాటు వైసీపీ హయాంలో ట్యాంకర్ల బిల్లుల చెల్లింపు కూడా కాకుండా అప్పట్లో సర్పంచులు, తాగునీటి సరఫరా కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైసీపీ సర్పంచులయితే ఈ సమస్యపై కుప్పంలోని గ్రామీణ నీటి సరఫరా కార్యాలయం ఎదుట చాలాసార్లు ధర్నాకు దిగడమే కాదు, అప్పటి వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ ఇంటిఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలు రెండుమూడు నెలల్లో జరుగుతాయనగా తమ సర్పంచుల నిరసనలనుంచి బయట పడడానికి ప్రభుత్వం తాగునీటి సరఫరా బిల్లులను క్లియర్ చేసింది. అయితే 2014లో టీడీపీ హయాం చివరలో రక్షిత మంచినీటి ట్యాంకుల మరమ్మతులు ప్రారంభించారు.మధ్యలో ప్రభుత్వం దిగిపోవడంతో పెండింగులో పడిన ఆ పనులను వైసీపీ హయాంలో పూర్తి చేశారు. అయితే ఈ పనులకు సంబంధించి రూ.8 కోట్ల బిల్లులు పెండింగులోనే ఉండిపోయాయి. దీంతో రామకుప్పం మండలంలో రక్షిత మంచి నీటి ట్యాంకుల మరమ్మతు పనులు జరగలేదు. ఈ మండలంలో మొత్తం 110 పనులకుగాను రూ.4.17 కోట్లను మంజూరు చేస్తూ ఈనెల 11న ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రామకుప్పం మండలంలో ప్రస్తుతం ఈ నిధులతో ట్యాంకుల మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
ఫ కరువు గ్రామాల్లో తాగునీటి బోర్ల తవ్వకం
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే తాగునీటి ఎద్డడి నివారణపై దృస్టి సారించింది.ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో చాలాచోట్ల ఎప్పట్నుంచో తాగునీటి సమస్య నెలకొని ఉంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా ఇప్పటికే నాలుగు మండలాల్లోని మొత్తం 26 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తోంది. ఇందులో అత్యఽధికంగా శాంతిపురం మండలంలో 14 గ్రామాలున్నాయి. గుడుపల్లె మండలంలో 7, కుప్పం మండలంలో 4, రామకుప్పం మండలంలో ఒక గ్రామానికి తాగునీటి సరఫరా జరుగుతోంది. మొత్తం 26 గ్రామాల్లో 20 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తుండగా, మిగిలిన 6 గ్రామాల్లో ప్రైవేటు వ్యవసాయ బోర్లతో టైఅప్ పెట్టుకుని సరఫరా చేస్తూ ఆయా గ్రామాల ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్నారు. అయితే రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇటీవల అంచనాలు తయారు చేసి పంపిన 118 పనులకు పాలనా అనుమతులు ఇస్తూ రూ.373.70 లక్షలను మంజూరు చేసింది. ఈ జీవో కూడా ఈనెల 11వ తేదీనే వెలువడింది. అయితే ఎక్కడెక్కడ తాగునీటి సమస్య నిజంగా ఉందో స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధుల ద్వారా గుర్తించి ఆయా పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టనున్నారు. ఇప్పటికే తాగునీటి సరఫరా జరుగుతున్న 26 గ్రామాల్లో ఒకటొకటిగా ఈ నిధులతో తాగునీటి బోర్ల తవ్వకాలు జరుగుతున్నాయి. శాంతిపురం మండలంలో ఎక్కువ ఇటువంటి గ్రామాలున్నాయి కాబట్టి, అక్కడ ఎక్కువ బోర్లు వేస్తున్నారు. 64-పెద్దూరు పంచాయతీ సోమాపురం, సి.బండపల్లె పంచాయతీ చిగుర్లపల్లె, మొరసనపల్లె పంచాయతీ కనమలదొడ్డి, కర్లగట్ట పంచాయతీ వెంకటాపురం, గుడుపల్లె మండలంలోని సంగనపల్లె పంచాయతీ జోగిండ్లు గ్రామాలలో ఇప్పటికే తాగునీటి బోర్ల తవ్వకం పూర్తయింది. గత నాలుగైదు రోజుల్లోనే ఈ బోర్లు వేశారు. వీటికి విద్యుత్తు కనెక్షన్ ఇచ్చి తాగునీటి పైపులైన్లను అనుసంధానం చేసే పని మిగిలి ఉంది.తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి గ్రామీణ నీటి పారుదల శాఖ డీఈఈ పురుషోత్తం మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన ఎస్డీఎఫ్ నిధులతో తొలుత తాగునీటి సరఫరా జరుగుతున్న గ్రామాల్లో బోర్ల తవ్వకం ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పారు. తర్వాత సమస్య తీవ్రతను బట్టి ఇతర గ్రామాల్లో బోర్ల తవ్వకం లేదా అదనపు పైపులైన్లు వేయడం వంటి పనులు జరుగుతాయని తెలిపారు.
Updated Date - Nov 20 , 2024 | 01:50 AM