జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెడదాం
ABN, Publish Date - Oct 29 , 2024 | 01:49 AM
ఎన్డీఏ కూటమి నాయకులు, అధికార యంత్రాంగం సమన్వయంతో జిల్లాను అన్నిరంగాల్లో ప్రథమ స్థానంలో నిలబెడతామని, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, తిరుపతి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
సమన్వయంతో
కూటమి ఆశయాలను సాకారం చేద్దాం
జిల్లా నేతలతో ఇన్‌చార్జి మంత్రి
అనగాని సత్యప్రసాద్
తిరుపతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎన్డీఏ కూటమి నాయకులు, అధికార యంత్రాంగం సమన్వయంతో జిల్లాను అన్నిరంగాల్లో ప్రథమ స్థానంలో నిలబెడతామని, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, తిరుపతి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఇంఛార్జి మంత్రిగా నియమితులైన ఆయన సోమవారం తొలిసారి జిల్లా ఎన్డీఏ నేతలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన తిరుపతి జిల్లాకు ఇంచార్జి మంత్రిగా నియమించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో ఎమ్మెల్యేలుగా కూటమి నేతలే ఉండటంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూడా అంతే సహకారంతో ముందుకు పోవాలన్నారు. నాయకుల మధ్య ఏదైనా అభిప్రాయబేధాలువస్తే సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అనగాని లాంటి సమర్థులైన మంత్రిని జిల్లాకు నియమించడం ఆనందంగా ఉందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. లోకేశ్ రెడ్ బుక్‌ను త్వరగా తెరవాల్సిన అవసరం ఉందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. క్రీడాభివృద్ధికి తమ సహకారం ఉంటుందని, నియోజకవర్గాల్లోని ఆటస్థలాలను ప్రజాప్రతినిధులు పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని శాప్ ఛైర్మన్ రవినాయుడు కోరారు. తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ అధ్యక్షత వహించిన ఈసమావేశంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని (చంద్రగిరి), పాశిం సునీల్‌కుమార్ (గూడూరు), రామకృష్ణ (వెంకటగిరి), నెలవల విజయశ్రీ (సూళ్లూరుపేట), మాజీ ఎంపీ పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, మోహన్, ఎస్సీవీ నాయుడు, హేమలత, మునిరామయ్య, జనసేన నేతలు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్, రాజా రెడ్డి, సుభాషిణి, బీజేపీ నేత అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 29 , 2024 | 06:34 AM