లిడ్‌క్యాప్ భూములను కాపాడుకుంటా
ABN, Publish Date - Oct 31 , 2024 | 02:21 AM
రాష్ట్రంలో అన్యాక్రాంతమైన లిడ్ క్యాప్ భూములను కాపాడుకుంటామని, సంస్థకు పూర్వవైభవం తీసుకువస్తామని లెదర్ ఇండస్ట్రీస్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (లిడ్‌క్యాప్) చైర్మన్ పిల్లి మాణిక్యరావు అన్నారు.
చర్మకార పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం
ఏపీ లిడ్‌క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు
తిరుపతి(కలెక్టరేట్) అక్టోబరు 30(ఆఽంధ్రజ్యోతి): రాష్ట్రంలో అన్యాక్రాంతమైన లిడ్ క్యాప్ భూములను కాపాడుకుంటామని, సంస్థకు పూర్వవైభవం తీసుకువస్తామని లెదర్ ఇండస్ట్రీస్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (లిడ్‌క్యాప్) చైర్మన్ పిల్లి మాణిక్యరావు అన్నారు. తిరుపతి-రేణిగుంట మార్గంలోని నారాయణాద్రి ఆస్పత్రి సమీపంలో ఉన్న మూతబడిన లిడ్‌క్యాప్ పరిశ్రమను, భూములను ఆయన బుధవారం పరిశీలించారు. భూములు కొంతమేర అన్యాక్రాంతమైన విషయం తెలుసుకుని అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థలాన్ని సర్వే చేయించి కబ్జాకు గురైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ స్థలంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి, చర్మకారులకు జీవనోపాధి కల్పిస్తామన్నారు. లిడ్‌క్యాప్ ద్వారా పరిశ్రమలను తీసుకురావడానికి సీఎం చంద్రబాబు విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో వనరులను నిర్వీర్యం చేశారని, వ్యవస్థలను సర్వనాశనం చేశారని తెలిపారు. 1973 అక్టోబరు 4న ఏర్పాటైన లిడ్‌క్యాప్ పరిశ్రమ వైఎ్‌స.రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందన్నారు. చంద్రబాబు పాలనలో ప్రాణం పోసుకుందని వివరించారు. ఈ కార్యక్రమంలో చర్మకారుల పరిరక్షణ సమితి నేతలు సుబ్బయ్య, రాజారావు, సుధాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 31 , 2024 | 02:21 AM