ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

lonely elephant-అమ్మో ఒంటరి ఏనుగు!

ABN, Publish Date - Oct 24 , 2024 | 01:26 AM

కుప్పం నియోజకవర్గ గ్రామీణులను ఒంటరి ఏనుగు చాలాకాలంగా వణికిస్తోంది.వారం రోజుల క్రితం కుప్పం మండలంలోని జనావాసాల్లో కనిపించిన ఈ మదపుటేనుగు రామకుప్పం మండలంలోనే నాలుగు నెలల వ్యవధిలో ఇద్దరు రైతులను చంపేసింది.

రెడ్యానాయక్‌ మృతదేహం

ఫ మదగజం దాడిలో మరొకరు హతం

ఫ నాలుగు నెలల్లో ఇద్దరి మృత్యువాత

ఫగ్రామీణులను వణికిస్తున్న గతానుభవాలు

కుప్పం/రామకుప్పం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి):కుప్పం నియోజకవర్గ గ్రామీణులను ఒంటరి ఏనుగు చాలాకాలంగా వణికిస్తోంది.వారం రోజుల క్రితం కుప్పం మండలంలోని జనావాసాల్లో కనిపించిన ఈ మదపుటేనుగు రామకుప్పం మండలంలోనే నాలుగు నెలల వ్యవధిలో ఇద్దరు రైతులను చంపేసింది. ఈ నేపథ్యంలో ఇంకెన్ని భీతావహ అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.

సాధారణంగా ఏనుగులు గుంపులుగా సంచరిస్తాయి. ఆహారంకోసమో, దాహం తీర్చుకోవడానికో అడవుల మధ్యనుంచి జనావాసాలవైపు వస్తూ దాడులు చేస్తాయి. గుంపులో ఉన్నప్పుడు వీటినుంచి ప్రమాదం తక్కువే ఉంటుంది. జనాలు గుంపులుగా చేరి డప్పులు వాయిస్తూనో, టపాసులు కాలుస్తూనో భయపెడితే, వెళ్లిపోతాయి. మళ్లీ చాలాకాలం ఇటువైపు తిరిగి చూడవు. కానీ గుంపునుంచి విడిపోయిన ఒంటరి ఏనుగు చాలా ప్రమాదకరమైనది. ఇది తాత్కాలికంగా మనుషుల అదిలింపులకు బెదిరినా, మళ్లీ మళ్లీ దాడికి తెగబడుతూనే ఉంటుంది.తత్ఫలితంగా గ్రామాల శివార్లలోని పొలాల్లో కాపలా ఉండే లేదా ఇతర పనులు చేసుకునే రైతులు మృత్యువాత పడుతుంటారు. వరుస దాడుల వల్ల ఒక్కోసారి వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు నలుగురు ప్రాణాలు కోల్పోయే సందర్భాలు కూడా ఉంటాయి. ఇటువంటి సందర్భం నాలుగేళ్ల క్రితం 2020వ సంవత్సరం సెప్టెంబరు చివర, అక్టోబరు మొదటి వారాల్లో కుప్పం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఆంధ్రా, కర్ణాటక సరిహద్దులోని గ్రామాల అటవీ పరిధిలో గుడుపల్లె, కుప్పం, శాంతిపురం మండలాల్లో ఏకంగా ముగ్గురు ఆ ఒంటరి ఏనుగు దాడికి బలైపోయారు. కేవలం ఆరు రోజుల్లో ముగ్గురు గ్రామీణులు మృత్యువాత పడ్డారు. తమిళనాడు సరిహద్దుల్లో గున్న ఏనుగుతోపాటు ఆడ ఏనుగును వెంటేసుకుని కుటుంబ సమేతంగా సంచరించే మగ ఏనుగు ఉన్నట్టుంటి ఒంటరి కావడమే దీనికి కారణం. గున్న ఏనుగుతోపాటు ఆడ ఏనుగును వేటగాళ్లు క్రూరంగా చంపేయడంతో ఒంటరిగా మారిన ఏనుగు, పిచ్చిపట్టినట్లు సంచరిస్తూ గ్రామాలలోకి వచ్చేసి ముగ్గురి ప్రాణాలను హరించింది.

నాలుగేళ్ల తరువాత పునరావృతం

రామకుప్పం మండలం పీఎంకే తాండాకు చెందిన రైతు రెడ్యా నాయక్‌ కూడా ఒంటరి ఏనుగు దాడిలోనే మృతి చెందాడు. 46 ఏళ్ల వయసు కలిగిన ఈ గ్రామీణుడిని మంగళవారం రాత్రి అడవి సమీపంలో ఉండగా ఏనుగు దాడిచేసి చంపేసింది. రెండునెలల క్రితం మరణించిన భార్య ప్రమీల జ్ఞాపకాలు మరువలేక ఆమెను ఖననం చేసిన శ్మశానం వద్దకు వెళ్ళిన రెడ్యానాయక్‌ బుధవారం ఉదయం శవమై పడివుండగా పశువుల కాపర్లు గుర్తించారు.రెడ్యానాయక్‌ ప్రాణాలు హరించిన ఏనుగుకు కూడా కుటుంబం వుందని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు.ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులో రెండు ఏనుగుల జంటతోపాటు, ఒక గున్న ఏనుగు సంచారాన్ని అధికారులే కాదు, గ్రామీణులు సైతం ఇటీవల గమనిస్తున్నారు. రెండుమూడు సార్లు ఈ ఏనుగులు గ్రామాలమీద పడితే, అధికారులు అటవీ సిబ్బందితో కలిసి అడవుల్లోకి తరిమేశారు. ఇటీవల ఒక్క ఏనుగు మాత్రమే అటవీ సమీప జనావాసాల వద్ద సంచరిస్తున్న విషయం గ్రామీణులు చాలాకాలంగా గమనిస్తున్నారు.ఆ ఒంటరి ఏనుగే ఇప్పుడు .పీఎంకేతాండాకు చెందిన రెడ్యానాయక్‌(48)ను దాడిచేసి చంపేసింది.నాలుగు నెలల క్రితం అంటూ జూన్‌ 15న ఇదే గ్రామానికి చెందిన వృద్ధ రైతు కన్నా నాయక్‌ కూడా ఇదే ఒంటరి ఏనుగుకు బలైపోయాడు. సాధారణంగా ఎప్పుడైనా సరే గున్న ఏనుగుతోపాటు రెండు పెద్ద ఏనుగుల జంట కలిసి కనిపించేది. ఇప్పుడు మిగిలిన రెండు ఏనుగులు ఏమైపోయాయో తెలియడంలేదు.2020లో ఒంటరి ఏనుగుకు జరిగినట్లు మిగిలిన రెండు ఏనుగులు వేటగాళ్ల ఉచ్చుకు బలైపోయాయా అన్న అనుమానాలు గ్రామీణులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అదే కనుక జరిగివుంటే, అటవీ సమీప గ్రామాలతోపాటు అటవీ శాఖాధికారులు సైతం మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. కుటుంబాన్ని కోల్పోయి ఒంటరిగా సంచరిస్తున్న ఏనుగు చాలా ప్రమాదకమైనదని 2020 నాటి మూడు మృత్యు సంఘటనలే కాదు, అనంతరం కుప్పం, పలమనేరు నియోజకవర్గాల పరిధిలో జరిగిన అనేక సంఘటనలు నిరూపించాయి. మళ్లీ ఏ క్షణమైనా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎక్కడైనా ఆ ఒంటరి ఏనుగు దాడిచేసే ప్రమాముంది.వారం రోజుల కిత్రం కుప్పం మండలం నూలుకుంట సమీప అటవీ ప్రాంతంనుంచి ఈ ఒంటరి ఏనుగు జనావాసాల్లోకి వచ్చింది. అటవీ శాఖాధికారులు దీన్ని కంగుంది, రామకుప్పం మండలం నారాయణపురం తాండా మీదుగా తమిళనాడు అడవుల్లోకి తరిమేశారు.కానీ, అది మళ్లీ జనావాసాలవైపు రాదని గ్యారంటీ ఏమీ లేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నిరంతరం తమకు రక్షణ కల్పించాలని గ్రామీణులు కోరుతున్నారు. కాగా రామకుప్పం మండలం పీఎంకే తాండాలో రెడ్యానాయక్‌ అనే రైతును చంపేసిన ఒంటరి ఏనుగును అడవుల్లోకి తరిమేశామని కుప్పం అటవీ శాఖాధికారి జయశంకర్‌ తెలిపారు. గ్రామీణులు రాత్రివేళ ఒంటరిగా అడవుల సమీపంలోని పొలాల్లో సంచరించవద్దని ఆయన హెచ్చరించారు.

మృతుడి కుటుంబానికి రూ.10లక్షల పరిహారం

ఒంటరి ఏనుగు దాడిలో మృతి చెందిన రెడ్యానాయక్‌ కుటుంబానికి ప్రభుత్వం 10లక్షల రూపాయల పరిహారాన్ని అందించింది.రెడ్యానాయక్‌ చనిపోయిన విషయం తెలిసి కుప్పం అటవీ శాఖాధికారి జయశంకర్‌ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, డీఎ్‌ఫవో భరణి, సీఐ మల్లేష్‌యాదవ్‌ పలమనేరు సబ్‌ డీఎ్‌ఫవో ఆస్పత్రి వద్ద రెడ్యానాయక్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. నష్టపరిహారంగా రూ.10 లక్షలు చెక్కును రెడ్యానాయక్‌ కుమారుడు సైరాజ్‌నాయక్‌కు అందజేశారు.టీడీపీ నాయకులు డాక్టర్‌ బీఆర్‌.సురేశ్‌బాబు,కృష్ణానాయక్‌, మునిరాజనాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2024 | 01:26 AM