వైభవంగా మహాపూర్ణాహుతి
ABN, Publish Date - Nov 15 , 2024 | 01:54 AM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలోని వరసిద్ధుడి వినాయక స్వామి ఆలయంలో మూడ్రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి.
- వరసిద్ధుడి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
ఐరాల(కాణిపాకం), నంవబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలోని వరసిద్ధుడి వినాయక స్వామి ఆలయంలో మూడ్రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఉదయం అవభృధ, యాగపూజ, స్తండిల మండలేశ్వర పూజ, హోమవ్రత, మహాపవిత్ర సమర్పణ, విశేష ద్రవ్యాహుతి, మహాపూర్ణాహుతి, మహాదీపారాధన, యాత్రదానం, మూల విరాట్‌కు స్తపనాభిషేకం, కుంభచండీయాగం, మహాదీపారాధన వైభవంగా నిర్వహించారు. ఏటా ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాక పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గురుప్రసాద్, ఏఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, అర్చకులు ధర్మేశ్వరగురుకుల్, వేద పండితులు పాల్గొన్నారు.
Updated Date - Nov 15 , 2024 | 01:54 AM