పంచాయతీలకు మరింత ఊరట
ABN, Publish Date - Nov 20 , 2024 | 01:48 AM
కాసుల లేమి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న గ్రామపంచాయతీలకు మరింత ఉపశమనం లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో జిల్లాపరిధిలోని గ్రామపంచాయతీలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి తొలివిడత 15వ ఆర్థిక సంఘ నిధులను కేంద్రం విడుదల చేసింది. మొత్తం 697 పంచాయతీలుండగా ఎన్నికలు జరగని 13 పంచాయతీలు మినహా 684 పంచాయతీలకు రూ.30,32,73,720 మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం జిల్లాకేంద్రానికి ఆదేశాలందాయి.ఆ నిధుల్లో టైడ్ గ్రాంట్ కింద రూ.18,19,64,239, అన్‌టైడ్ గ్రాంట్ కింద రూ.12,13,09,481 వెరసి మొత్తంగా రూ.30.32 కోట్లు విడుదలయ్యాయి.
చిత్తూరు కలెక్టరేట్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కాసుల లేమి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న గ్రామపంచాయతీలకు మరింత ఉపశమనం లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో జిల్లాపరిధిలోని గ్రామపంచాయతీలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి తొలివిడత 15వ ఆర్థిక సంఘ నిధులను కేంద్రం విడుదల చేసింది. మొత్తం 697 పంచాయతీలుండగా ఎన్నికలు జరగని 13 పంచాయతీలు మినహా 684 పంచాయతీలకు రూ.30,32,73,720 మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం జిల్లాకేంద్రానికి ఆదేశాలందాయి.ఆ నిధుల్లో టైడ్ గ్రాంట్ కింద రూ.18,19,64,239, అన్‌టైడ్ గ్రాంట్ కింద రూ.12,13,09,481 వెరసి మొత్తంగా రూ.30.32 కోట్లు విడుదలయ్యాయి.
మంచి రోజులే
జిల్లావ్యాప్తంగా 60శాతం గ్రామపంచాయతీలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా, ఇప్పుడిప్పుడే వాటికి ఉపశమనం లభిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హాయంలో టీడీపీతోపాటు వైసీపీకి చెందిన సర్పంచ్‌లు అప్పులు చేసి మరీ ఖర్చు చేసి, బిల్లులు విడుదలకాక లబోదిబోమనేవారు. నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన 14, 15 ఆర్థిక సంఘాల నిధులను విద్యుత్ బకాయిల పేరిట 80శాతం మినహాయించుకోవడం ఇక్కట్లను జటిలం చేశాయి. గత ప్రభుత్వ తీరును నిరసిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు సర్పంచులు ఎన్నో పోరాటాలు చేసినా ఫలితం లేకపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వారిద్దరి చొరవ కారణంగా పాత బకాయిలు రెండు దఫాలుగా కేంద్రం నుంచి విడుదలయ్యాయి. ప్రస్తుతం విడుదలచేసిన నిధులను కేంద్ర ప్రభుత్వమే నేరుగా పంచాయతీల ఖాతాలకే కేటాయించనుంది. ఈ నేపథ్యంలో ఆయా పంచాయతీలకు ఎంత మొత్తం వచ్చిందనే సమాచారం పంపే ఏర్పాట్లలో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. సంబంధిత ప్రక్రియను డీపీవో పార్వతి పర్యవేక్షిస్తున్నారు.
Updated Date - Nov 20 , 2024 | 01:48 AM