ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తూర్పుకనుపూరులో ముత్యాలమ్మ జాతర ప్రారంభం

ABN, Publish Date - Apr 03 , 2024 | 01:34 AM

చిల్లకూరు మండలంలోని తూర్పుకనుపూరులో మంగళవారం ముత్యాలమ్మ జాతర ప్రారంభమైంది.

ఆలయం వద్ద భక్తుల రద్దీ (ఇన్‌సెట్‌లో) బంగారుచీర అలంకరణలో ముత్యాలమ్మ

చిల్లకూరు మండలంలోని తూర్పుకనుపూరులో మంగళవారం ముత్యాలమ్మ జాతర ప్రారంభమైంది.తూర్పుకనుపూరు, ఈదలవారిపాళెం, పోసినవారిపాళెం, రావులవారిపాళెం, కొమరావారిపాళెం గ్రామాల్లో ఘటాన్ని ఊరేగించారు. గంగమిట్ట మీద తాత్కాలికంగా పోలేరమ్మకు వేదిక ఏర్పాటు చేశారు. గుడిసెలో కుమ్మరి తయారు చేసిన పోలేరమ్మ విగ్రహాన్ని రజకులు తప్పెట్లు, తాళాలతో మోసుకువచ్చి ప్రతిష్టించారు. గాలిగంటల చెట్టు వద్ద కుంభం పోశారు. భక్తులు వేయికండ్ల కుండలలో గండదీపాలను వెలిగించుకుని నెత్తిన పెట్టుకుని, మొలకు వేపాకులు దరించి ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ముత్యాలమ్మకు బంగారుచీర అలంకారంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.సామూహిక పల్లకీ సేవ, పూలంగిసేవ ఘనంగా జరిపారు. రాత్రికి అర్థరఽథంపై అమ్మవారిని సింహవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. -చిల్లకూరు

Updated Date - Apr 03 , 2024 | 01:35 AM

Advertising
Advertising