AP News: విద్యుత్ ఘాతానికి నవ వరుడు మృతి.. చిత్తూరులో విషాదం
ABN, Publish Date - Jan 31 , 2024 | 10:00 AM
Andhrapradesh: జిల్లాలోని సోమల మండలం దేవల కుప్పం యానాదివాడలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ ఘాతానికి నవ వరుడు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అడవి జంతువుల వేట కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగలడంతో ఈ ఘటన జరిగింది.
చిత్తూరు, జనవరి 31: జిల్లాలోని సోమల మండలం దేవల కుప్పం యానాదివాడలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ ఘాతానికి నవ వరుడు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అడవి జంతువుల వేట కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగలడంతో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన గంగాధరం, సిద్దప్ప, ఈశ్వరయ్య ముగ్గురూ కలిసి గొర్రెలను మేత కోసం మంగళవారం అడవికి తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో కొన్ని గొర్రెలు కనిపించకపోవడంతో తిరిగి అడవిలో వాటిని వెతికేందుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
అడవి జంతువుల వేట కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగలడంతో గంగాధర్ (20) అనే వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. గంగాధర్‌ను కాపాడే ప్రయత్నంలో సిద్ధప్ప (30)కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని సదుం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరో బాలుడు ఈశ్వరయ్య విద్యుత్ ఘాతం నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. కాగా.. మృతడు గంగాధర్‌కు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. గంగాధర్ మృతి వార్త తెలిసి భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 31 , 2024 | 10:00 AM