తిరుపతిలో డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం
ABN, Publish Date - Jul 12 , 2024 | 12:50 AM
డైరెక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ అండ్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ పరిధిలో తిరుపతి కేంద్రంగా డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం ఏర్పాటు కానుంది.
తిరుపతి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): డైరెక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ అండ్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ పరిధిలో తిరుపతి కేంద్రంగా డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం ఏర్పాటు కానుంది. ఇక్కడ ఈ కార్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తిరుపతి కార్యాలయం పరిధిలోకి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, నెల్లూరు జిల్లాలు రానున్నాయి. అలాగే దీని పరిధిలో కడప, నెల్లూరు, తిరుపతి సబ్ డివిజన్లు వుంటాయి. ఇప్పటికే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ కేంద్రంగా విద్యుత్ శాఖకు సంబంధించి తిరుపతి కీలక కేంద్రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నేరుగా ప్రభుత్వ నియంత్రణలో పనిచేసే ఎలక్ట్రికల్ సేఫ్టీ విభాగానికి సంబంధించి కూడా తిరుపతి ముఖ్య పాలనా కేంద్రంగా మారనుంది. తిరుపతిలో కార్యాలయం ఏర్పాటుకు అనుమతినిస్తూ, అలాగే డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టు మంజూరు చేస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Updated Date - Jul 12 , 2024 | 12:50 AM