ఆరేళ్ల చిన్నారిపై వృద్ధుడి లైంగిక దాడి
ABN, Publish Date - Jul 13 , 2024 | 12:17 AM
ఆరేళ్ల చిన్నారిపై పాశవికంగా లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
ఏర్పేడు, జూలై 12 : ఆరేళ్ల చిన్నారిపై పాశవికంగా లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఏర్పేడు సీఐ శ్రీరామ శ్రీనివాసులు కథనం ప్రకారం ఏర్పేడు మండలానికి చెందిన బలరామయ్య గౌడ్(61) ఓ ఆరేళ్ల చిన్నారిపై కన్నేశాడు.గత ఆదివారం అమ్మానాన్న పొలంవద్దకు వెళ్లడంతో ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్ ఇచ్చి తన వెంట తీసుకెళ్లాడు.లైంగికదాడికి పాల్పడడంతో చిన్నారి పెద్దగా కేకలు పెట్టింది.దీంతో అమ్మానాన్నకు ఈ విషయం చెబితే కొడతానని బెదిరించి చిన్నారిని వదిలిపెట్టాడు.ఆ రోజు సాయంత్రం స్నానం చేయించే సమయంలో యోని వద్ద నొప్పిగా ఉందని తల్లికి ఆ చిన్నారి చెప్పింది. ఆర్‌ఎంపీ దగ్గర చూపించగా మందులిచ్చి పంపాడు. రెండు రోజులు దాటినా నొప్పి తగ్గకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఈ నెల 9వ తేదీ రేణిగుంట సమీపంలోని బాలాజీ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు చిన్నారిపై లైంగికదాడి జరిగినట్లు నిర్ధారించారు.చిన్నారిని తల్లిదండ్రులు మెల్లగా ఏం జరిగిందని అడిగి విషయం తెలుసుకున్నారు.శుక్రవారం ఏర్పేడు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
Updated Date - Jul 13 , 2024 | 12:17 AM