‘ఓపీ’ జాప్యం కాకుండా చర్యలు
ABN, Publish Date - Nov 08 , 2024 | 02:46 AM
ఇకపై రుయాసుపత్రిలో ఓపీ మంజూరులో జాప్యం జరగకుండా చర్యలు చేపట్టినట్టు సూపరింటెండెంట్ రవిప్రభు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
తిరుపతి(వైద్యం), నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ఇకపై రుయాసుపత్రిలో ఓపీ మంజూరులో జాప్యం జరగకుండా చర్యలు చేపట్టినట్టు సూపరింటెండెంట్ రవిప్రభు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రుయాలో ‘ఓపీ’కకు పరీక్ష’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు ఓపీ మంజూరుకు ఆధార్ లింక్ చేయాల్సి ఉందని, అలాగే బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడంతో కాస్త ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. ఇకపై ఆలస్యం జరుగకుండా సోమవారం నుంచి మరో రెండు అదనపు ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దీంతో మొత్తం 9 ఓపీ కౌంటర్లు రోగులకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇకపై ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జనరల్ ఓపీ ఉండనుంది. అత్యవసరం, చిన్నపిల్లల విభాగ ఓపీ 24 గంటలూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Updated Date - Nov 08 , 2024 | 02:46 AM