ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పార్టీ విధేయులకు పట్టం

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:07 AM

పదిమందిలో ఆరుగురు డైరెక్టర్లు కుప్పం నియోజకవర్గానికి చెందిన వారే ఉన్నారు

చిత్తూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతల వేధింపులను సమర్థంగా ఎదుర్కోవడమే కాక ఇటీవలి ఎన్నికల్లో కూటమి పార్టీల విజయానికి కృషి చేసిన నాయకులను వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లుగా నియమించారు.పదిమంది జిల్లా నాయకులకు చోటు దక్కగా.. వన్నియకుల క్షత్రియ కార్పొరేషన్‌లో ఏడుగురు, కురబ కార్పొరేషన్‌లో ముగ్గురు ఉన్నారు.వీరిలో తొమ్మిదిమంది టీడీపీ నాయకులు కాగా, ఒకరు జనసేనకు చెందినవారున్నారు. పదిమందిలో ఆరుగురు డైరెక్టర్లు కుప్పం నియోజకవర్గానికి చెందిన వారే ఉన్నారు.వన్నియకుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్లుగా శాంతిపురం మండలానికి చెందిన రుద్రప్ప, ఎన్‌.చంద్రశేఖర్‌,పెద్దచిన్నప్ప వామన(జనసేన), గుడుపల్లె మండలానికి చెందిన ఆర్‌.చంద్రశేఖర్‌ , డీవీ అరుణాచలం,కార్వేటినగరం మండలానికి చెందిన రాజేంద్రరెడ్డి,నగరి మండలానికి చెందిన శ్రీనివాసులు నియమితులయ్యారు.అలాగే తిరుపతి జిల్లా పుత్తూరు మండలానికి చెందిన షణ్ముగ రెడ్డిని కూడా నియమించారు. కురబ కార్పొరేషన్‌ డైరెక్టర్లుగా కుప్పం మండలానికి చెందిన ఎం.రాజగోపాల్‌ ,పలమనేరు మండలానికి చెందిన సుబ్రమణ్యం గౌడ్‌,రొంపిచెర్ల మండలానికి చెందిన ఉయ్యాల రమణ వున్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:08 AM