ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజారోగ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కార్యాచరణ

ABN, Publish Date - Nov 14 , 2024 | 02:03 AM

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. చాపకింద నీరులా విస్తరిస్తోన్న క్యాన్సర్‌ నియంత్రణకు దృష్టి పెట్టింది. తొలిదశలోనే గుర్తించడం ద్వారా నయం చేయొచ్చన్న భావనతో.. గురువారం నుంచి స్ర్కీనింగ్‌ పరీక్షలు చేపట్టనుంది. దీంతో పాటు మరో ఐదు రకాల పరీక్షలూ నిర్వహించనుంది.

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. చాపకింద నీరులా విస్తరిస్తోన్న క్యాన్సర్‌ నియంత్రణకు దృష్టి పెట్టింది. తొలిదశలోనే గుర్తించడం ద్వారా నయం చేయొచ్చన్న భావనతో.. గురువారం నుంచి స్ర్కీనింగ్‌ పరీక్షలు చేపట్టనుంది. దీంతో పాటు మరో ఐదు రకాల పరీక్షలూ నిర్వహించనుంది.

- తిరుపతి (వైద్యం), ఆంధ్రజ్యోతి

జాతీయ ఆరోగ్య మిషన్‌, రాష్ట్రప్రభుత్వం గురువారం యూనివర్సల్‌ కామన్‌ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లను గుర్తించేందుకు స్ర్కీనింగ్‌ చేయనున్నారు. అందుకు ఒక వైద్యాధికారితోపాటు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు చేస్తారు. వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించి సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందించనున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 58, అర్బన్‌ ఏరియాల్లో 25 పీహెచ్‌సీలు, హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ క్లినిక్స్‌ 440 ఉన్నాయి. ఒక్కో పీహెచ్‌సీ పరిధిలో రోజుకు ఒక ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీ, ఆశా కార్యకర్త ఐదు ఇళ్లకు వెళ్లి స్ర్కీనింగ్‌ చేస్తారు. 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ రక్తపోటు, మధుమేహం, హెచ్‌బీ, ఆర్‌బీఎస్‌ వంటి పరీక్షలు చేస్తారు.ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వివరాలు నమోదు చేస్తారు. నోటి, రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి ప్రాథమిక పరీక్షలు చేస్తారు. 30 ఏళ్లు పైబడిన మహిళలకు గర్భాశయ ముఖద్వార (సర్వైకల్‌ క్యాన్సర్‌)కు సంబంధించి ప్రాథమిక పరీక్ష చేస్తారు. వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించి వివరాలను కమ్యూనిటీ బేస్‌డ్‌ అసెస్మెంట్‌ చెక్‌లి్‌స్ట(సీబాక్‌) యాప్‌లో నమోదు చేస్తారు. ఈ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన వైద్య సామగ్రిని ఇప్పటికే కేటాయించారు. ఈ కార్యక్రమం కోసం 900 మందిని నియమించారు.

వైద్య సేవలు ఇలా.

రొమ్ము, గర్భాశయ ముఖద్వార, నోటి క్యాన్సర్‌ లక్షణాలున్న వారిని గుర్తిస్తే మొదట జిల్లా ఆస్పత్రి, ఏరియా, సీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన నోడల్‌ అధికారులు పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడే నయం చేయగలిగే స్థాయిలో ఉంటే వైద్యం అందిస్తారు, క్యాన్సర్‌ తీవ్రత ఎక్కువుంటే తిరుపతిలోని రుయాస్పత్రికి సిఫార్సు చేసి అక్కడే ఉచితంగా వైద్యం అందిస్తారు. ఈ ఆస్పత్రితో పాటు ఎన్టీఆర్‌ వైద్యసేవ అమలవుతున్న అస్పత్రులకు పంపుతారు. అక్కడ ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటారు.ఇంత పెద్ద స్ర్కీనింగ్‌, సర్వే కార్యక్రమం నిర్వహించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఇందులో ప్రజల ఆహారపు అలవాట్ల నుంచి వారి మానసికస్థితి, అలవాట్లు, ఏం తింటారు, ఏం తాగుతారు, వారి స్థితిగతులేంటి, ఏ ఆహారం తీసుకుంటారనే విషయాలను కూడా ఈ స్ర్కీనింగ్‌ కార్యక్రమంలో పొందుపరచనున్నారు. ప్రభుత్వం ముందు చూపుతో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని వైద్యఆరోగ్య శాఖ సక్రమంగా నిర్వహిస్తే జిల్లాలో క్యాన్సర్‌ను తరిమికొట్టొచ్చు.

స్ర్కీనింగ్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

స్ర్కీనింగ్‌ చేసేందుకు బృందాలన్నింటినీ సిద్ధం చేశాం. ఇప్పటికే వీరికి శిక్షణ ఇచ్చాం. పరీక్షలకు అవసరమైన సామగ్రిని సంబంధిత పీహెచ్‌సీలకు పంపించాం. 6 నుంచి 8 నెలల్లోపు స్ర్కీనింగ్‌ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఇది చాలా మంచి కార్యక్రమం సదన్వియోగం చేసుకోండి.

- శ్రీహరి, డీఎంహెచ్‌వో

ఈ ఏడాది చేసిన స్ర్కీనింగ్‌ పరీక్షలు

టాటా క్యాన్సర్‌ ఆస్పత్రి: 48 వేల మందికి

స్విమ్స్‌ ఆధ్వర్యంలో..: 9584

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ: 400

Updated Date - Nov 14 , 2024 | 02:03 AM