ఎగరడానికి రెడీ
ABN, Publish Date - Dec 04 , 2024 | 01:36 AM
స్వదేశీ, విదేశీ శాస్త్రవేత్తలతో శ్రీహరికోట రాకెట్ కేంద్రం సందడిగా మారింది. సాయంత్రం 4.08 గంటలకు పీఎ్‌సఎల్వీ-సీ 59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి చేర్చనున్న సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ రేపు సాయంత్రం దాకా కొనసాగుతుంది
రాకెట్ ఎత్తు: 44.4 మీటర్లు
బరువు: 320 టన్నులు
ప్రయోగానికి పట్టే సమయం: 26.92 నిమిషాలు
స్వదేశీ, విదేశీ శాస్త్రవేత్తలతో శ్రీహరికోట రాకెట్ కేంద్రం సందడిగా మారింది. సాయంత్రం 4.08 గంటలకు పీఎ్‌సఎల్వీ-సీ 59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి చేర్చనున్న సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ రేపు సాయంత్రం దాకా కొనసాగుతుంది. షార్‌లోని మొదటి ప్రయోగ వేదికమీద రాకెట్ ఎగరడానికి సిద్ధంగా ఉంది. కాగా, పీఎ్‌సఎల్వీ అనుసంధాన ప్రక్రియకు సంబంధించిన ఫొటోలను ఇస్రో మంగళవారం విడుదల చేసింది. పీఎ్‌సఎల్వీ ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ పెసిలిటీ (పీఐఎ్‌ప)లో రెండు దశల రాకెట్‌ను, మొబైల్ సర్వీస్ టవర్‌లో (ఎంఎ్‌సటీ) మరో రెండు దశల రాకెట్‌ను అనుసంధానం చేశారు.
మొదటి దశ: 139 టన్నలు ఘన ఇంధనం కలిగిన రాకెట్ మొదటి దశను కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో డిజైన్ చేసి తీసుకొచ్చి శ్రీహరికోటలో అనుసంఽధానం చేశారు.
రెండో దశ: పీఎస్-2 మోటారులో 41 టన్నుల ధ్రవ ఇంధనాన్ని నింపారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో మోటారు తయారు చేశారు.
మూడో దశ: 7.65 టన్నుల ఘన ఇంధనం నింపారు.
నాలుగోదశ: ఈ దశలో 2.5 టన్నుల ధ్రవ ఇంధనం నింపారు. రాకెట్ శిఖర భాగాన ప్రోబా-3 ఉపగ్రహాన్ని అమర్చారు. ఉపగ్రహం చుట్టూ హీట్‌షీల్డ్ (ఉష్టకవచం) అమర్చారు. ఇది తుది దశ. ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టే రాకెట్ దశ ఇది. ఈ దశలో ఘన ఇంధనం మోటార్లకు నింపి రాకెట్‌కు అనుసంధానం చేశారు. కౌంట్‌డౌన్ జరిగే సమయంలోనే ధ్రవ ఇంధనాన్ని నింపుతారు.
- సూళ్లూరుపేట, ఆంధ్రజ్యోతి
Updated Date - Dec 04 , 2024 | 01:36 AM