ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చాట్‌బాట్‌తో 305 సెల్‌ఫోన్ల రికవరీ

ABN, Publish Date - Sep 16 , 2024 | 01:15 AM

వీటి విలువ రూ.66లక్షలు : ఎస్పీ

రికవరీ చేసిన ఫోన్లను చూపిసున్న ఎస్పీ మణికంఠ చందోలు

చిత్తూరు, సెప్టెంబరు 15: ఇప్పటి వరకు ఏడు విడతల్లో 2030 ఫోన్లను జిల్లా పోలీసులు రికవరీ చేశారు. ఎనిమిదో విడతలో రూ.66లక్షల విలువ చేసే 305 సెల్‌ఫోన్లను రికవరీ చేశారు. ఈ వివరాలను ఆదివారం ఎస్పీ మణికంఠ చందోలు మీడియాకు తెలిపారు. జిల్లాలో కొంత కాలంగా వందలాది మంది మొబైల్‌ ఫోన్లను పోగొట్టుకున్నారు. ఈ ఫోన్లను రికవరీ చేయడానికి చాట్‌బాట్‌ బృందం తగిన చర్యలు చేపట్టింది. నెలల వ్యవధిలో ఏపీతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర నుంచి చోరీకి గురైన 66 లక్షల విలువ చేసే 305 ఫోన్లను రికవరీ చేశారు. ఈ ఫోన్లను ఆదివారం పోలీసు అతిథి గృహంలో బాధితులకు అందించారు.

చాట్‌బాట్‌లో నమోదు చేయడమిలా..

మొబైల్‌ ఫోన్‌ను పోగొట్టుకున్న వారి ముందుగా 9440900004 నెంబరు వాట్సా్‌పకు హాయ్‌ లేదా హెల్ప్‌ అని పంపాలి. ఆ తర్వాత వెల్‌కమ్‌ టూ చిత్తూరు పోలీసు పేరున ఒక లింకు వస్తుంది. ఆ లింకులో గూగుల్‌ ఫార్మేట్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో జిల్లా, పేరు, వయస్సు, తండ్రి, చిరునామా, కాంటాక్టింగ్‌ నెంబరు, మిస్‌ అయిన మొబైల్‌ మోడల్‌, ఐఎంఈఐ నెంబరు, మొబైల్‌ మిస్‌ అయిన ప్లేస్‌ వివరాలను నమోదు చేయాలి. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.

Updated Date - Sep 16 , 2024 | 01:15 AM

Advertising
Advertising