Recovery-రూ.65 లక్షల విలువైన ఫోన్ల రికవరీ
ABN, Publish Date - Oct 24 , 2024 | 01:35 AM
దాదాపు 65 లక్షల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి పోగొట్టుకున్నవారికి అందజేశారు.చిత్తూరులో బుధవారం మీడియా సమావేశంలో ఎస్పీ మణికంఠ ఆ వివరాలను వెల్లడించారు.
చిత్తూరు అర్బన్/గంగాధరనెల్లూరు, అక్టోబరు 23: దాదాపు 65 లక్షల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి పోగొట్టుకున్నవారికి అందజేశారు.చిత్తూరులో బుధవారం మీడియా సమావేశంలో ఎస్పీ మణికంఠ ఆ వివరాలను వెల్లడించారు. జిల్లాలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నట్లు చాట్‌బాట్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులను స్వీకరించి 30 రోజుల్లో 300 ఫోన్లను రికవరీ చేశామని చెప్పారు. మన రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర,కేరళ రాష్ర్టాల నుంచి కూడా వీటిని రికవరీ చేశామన్నారు. వీటిలో 70 మొబైల్‌ఫోన్లను రికవరీ చేసిన గంగాధరనెల్లూరు హెడ్‌కానిస్టేబుల్ దామోదరం ఎస్సీ చేతులమీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.క్రైమ్ సీఐ ఉమామహేశ్వరరావు, చాట్‌బాట్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ చాట్‌బాట్‌కు ఫిర్యాదు పంపేదిలా...
మొబైళ్లను పోగొట్టుకున్న వారు ముందుగా 9440900004 నెంబరు వాట్సా్‌పకు హాయ్ లేదా హెల్ప్ అని పంపాలి.వెంటనే వెల్‌కమ్ టు చిత్తూరు పోలీసు పేరున ఒక లింకు వస్తుంది. ఆ లింకులోని గూగుల్ ఫార్మాట్ ఓపెన్ అయ్యాక వివరాలను పూరించాలి. జిల్లా పేరు, వయస్సు, తండ్రి, చిరునామా, కాంటాక్టు నెంబరు, మిస్సయిన మొబైల్ మోడల్, ఐఎంఈఐ నెంబరు, మిస్సయిన ప్లేస్ వివరాలను పూరించిన వెంటనే ఫిర్యాదు నమోదవుతుంది. చాట్‌బాట్‌సేవలను ప్రజలు వినియోగించుకోవాలని, ఫోన్ చోరీకి గురైన వెంటనే సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.
Updated Date - Oct 24 , 2024 | 01:35 AM