ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చిత్తూరుకు వచ్చేందుకు సబ్‌రిజిస్ట్రార్ల అనాసక్తి

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:00 AM

ఇక్కడున్న రెండు సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టులకు గత్యంతరం లేని పరిస్థితుల్లో సీనియర్‌ అసిస్టెంట్లనే ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్లుగా అధికారులు నియమిస్తున్నారు

చిత్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): స్టాంప్స్‌,రిజిస్ట్రేషన్‌ శాఖకు సంబంధించి చిత్తూరులో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ సబ్‌రిజిస్ట్రార్లుగా పనిచేయాలంటే ఆసక్తి చూపడం లేదు.పోస్టింగ్‌ ఇస్తే దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళిపోతున్నారు.దీంతో ఇక్కడున్న రెండు సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టులకు గత్యంతరం లేని పరిస్థితుల్లో సీనియర్‌ అసిస్టెంట్లనే ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్లుగా అధికారులు నియమిస్తున్నారు. గత ఆరేళ్ళకాలంలో రెగ్యులర్‌ ఎస్‌ఆర్‌లకంటే ఇన్‌చార్జి ఎస్‌ఆర్‌లే ఎక్కువమంది పనిచేశారు.ఇటీవలి కౌన్సెలింగ్‌లో కూడా ఇతర ప్రాంతాలకు పోటీ ఎక్కువగా ఉండగా, చిత్తూరు స్థానాన్ని కోరే నాథుడే లేడు.

14వేలకు పైగా రిజిస్ట్రేషన్లు

చిత్తూరు జిల్లాలో ఏడాది కాలానికి అత్యధిక సంఖ్యలో అంటే 14వేలకు పైగా రిజిస్ట్రేషన్లు చిత్తూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే జరుగుతున్నాయి.10వేలకు మించి రిజిస్ట్రేషన్లు జరిగే ప్రాంతాల్లో ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్లను జాయింట్‌-1, జాయింట్‌-2 పేరిట పోస్టులను ప్రభుత్వం సృష్టించింది.చిత్తూరు పాత కలెక్టరేట్‌ కార్యాలయం పక్కనే వున్న పాత భవనంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం కొనసాగేంతవరకు పరిస్థితులు బాగానే ఉండేవి. 2018 జూలై 21న టీడీపీ ప్రభుత్వ హయాంలో పాత భవనం పక్కన రూ.3కోట్లతో రిజిస్ట్రేషన్‌ కాంప్లెక్‌ పేరిట రెండంతస్థుల కొత్త భవనం ఏర్పాటైంది. ఇందులో స్టాంపు అండ్‌ రిజిస్ట్రేషన్లశాఖ డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్‌ (మార్కెట్‌ వాల్యూ), జిల్లా రిజిస్ట్రార్‌ (ఆడిట్‌), జిల్లా చిట్స్‌ ఆఫీసర్‌ కార్యాలయాలతో పాటు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో చిత్తూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఏర్పాటయ్యారు.అయితే వీధికి ఎదురుగా భవనం ఏర్పాటు చేయడంతో వాస్తుదోషం ఏర్పడిందని ఆఫీసు సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.ఈ కారణంగానే గత ఆరేళ్ళ కాలంలో పలుమార్లు ఏసీబీ తనిఖీలు జరిగాయని, పలువురు సబ్‌రిజిస్ట్రార్లు సస్పెండయ్యారని ప్రచారం జరగడంతో ఇక్కడ పనిచేసేందుకు సబ్‌రిజిస్ట్రార్లు భయపడిపోతున్నారు. నిజానికి రిజిస్ట్రేషన్లు చేసే సమయంలో ఏ సర్వే నెంబరు ఏ నిషేధ భూమిలో ఉందో తెలియక డాక్యుమెంట్‌ రైటర్లు చెప్పే మాటలను నమ్మి రిజిస్ట్రేషన్లు చేసి సబ్‌రిజిస్ట్రార్లు సస్పెన్షన్లకు గురయ్యారు.ఈ కారణంతోనే సబ్‌రిజిస్ట్రార్‌ శ్రీధర్‌గుప్తా రెండేళ్ళక్రితం సస్పెండయ్యారు. రెండుసార్లు ఏసీబీ తనిఖీలు జరగ్గా కొందరు సబ్‌రిజిస్ట్రార్లు కేసుల్లో ఇరుక్కోవడంతో జీతాలు ఆపేశారు. దీంతో రెండు సబ్‌రిజిస్ట్రార్‌ పోస్టులకు ఆరేడుమంది సీనియర్‌ అసిస్టెంట్లు ఇన్‌చార్జులుగా పనిచేశారు.

అటు జాయిన్‌ - ఇటు సెలవుల్లో

సెప్టెంబరు నెలలో ఇక్కడ జాయింట్‌-1 సబ్‌రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన అశోక్‌కుమార్‌ డిసెంబరులో రిటైర్‌ కానున్నారు. ఆయన చేరిన రోజు నుంచే డిసెంబరు 15వ తేదీ వరకు రెండు విడతలుగా అనారోగ్య కారణాలు చూపి సెలవుపై వెళ్ళారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో హేమంత్‌రాజు అనే సీనియర్‌ అసిస్టెంట్‌ను ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌గా జిల్లా రిజిస్ట్రార్‌ మునిశంకరయ్య గత నెలలో నియమించారు.చివరకు ఆయనకే కీలకమైన జాయింట్‌-1, జాయింట్‌-2 సబ్‌రిజిస్ట్రార్‌ పోస్టులు అప్పగించారు.

దోష నివారణకు వినాయకుడు!

కొత్త భవనానికి వీధిపోటు, వాస్తుదోషం వుండడం వల్లే పలు అనర్థాలు జరుగుతున్నాయని భావించిన అధికారులు దోష నివారణకు గత ఏడాది భవనం వద్ద వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కొద్దిరోజులకే ఆ విగ్రహాన్ని ఎవరో మాయం చేశారు.ఏమైందోగానీ మూడ్రోజుల తర్వాత దాన్ని యథాస్థలంలో వుంచివెళ్ళారు.

Updated Date - Nov 13 , 2024 | 12:00 AM