బోగస్ ఎపిక్‌కార్డులుంటే వెంటనే వెనక్కివ్వండి
ABN, Publish Date - Oct 27 , 2024 | 01:35 AM
బోగస్ ఎపిక్‌కార్డులు తయారు చేసినా లేదా కలిగి ఉన్నా శిక్ష తప్పదని కలెక్టర్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 39,251 ఎపిక్ కార్డుల(ఓటరుకార్డులు) డేటాను అనధికారికంగా డౌన్‌లోడ్ చేసినట్లు నిర్ధారణ అయిందని వెల్లడించారు
తిరుపతి(కలెక్టరేట్), అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : బోగస్ ఎపిక్‌కార్డులు తయారు చేసినా లేదా కలిగి ఉన్నా శిక్ష తప్పదని కలెక్టర్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 39,251 ఎపిక్ కార్డుల(ఓటరుకార్డులు) డేటాను అనధికారికంగా డౌన్‌లోడ్ చేసినట్లు నిర్ధారణ అయిందని వెల్లడించారు. బోగస్ ఎపిక్‌కార్డుల ద్వారా 2021లో జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో అక్రమంగా ఓట్లు వేయడానికి ప్రయత్నించారని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే పలువురు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని, కేసులు కూడా నమోదు చేశామని తెలిపారు. బోగస్ ఎపిక్‌కార్డులు కలిగి ఉన్న వ్యక్తులు వెంటనే వాటిని తిరుపతి అసెంబ్లీ ఎన్నికల అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్‌కు కానీ, కలెక్టర్ కార్యాలయంలో కాని అప్పజెప్పాలని శనివారం ఒక ప్రకటనలో సూచించారు.
Updated Date - Oct 27 , 2024 | 01:35 AM