ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పులికాట్‌కు పునఃవైభవం

ABN, Publish Date - Nov 12 , 2024 | 01:21 AM

పూడికతీతకు 97 కోట్లు కేటాయింపు

తడ/వాకాడు, ఆంధ్రజ్యోతి: పులికాట్‌ మత్స్యకారుల చిరకాల కోరిక నేరవేరనుంది. బడ్జెట్‌లో పులికాట్‌ పూడిక తీతకు రూ.97 కోట్లు కేటాయించడంతో మత్స్యకారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పులికాట్‌ సరస్సు ముఖద్వారాలు మూడు దశాబ్దాలకు ముందే పూడుకుపోయాయి. అప్పట్నుంచి మత్స్యకారుల జీవనం గగనంగా మారింది. ప్రభుత్వాలు మారుతున్నా పూడికతీతను పట్టించుకోలేదు. గత వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాటు పట్టించుకోకుండా.. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అంటే గతేడాది నవంబరులో పూడికతీత పనులకు శంకుస్థాపన చేస్తున్నామంటూ హడావుడి చేసింది. అప్పటి సీఎం జగన్‌ తడ మండలం మాంబట్టులో శంకుస్థాపనకు సిద్ధం కాగా వరుణుడు అడ్డురావడంతో వాయిదాపడింది. ఆ తరువాత దీనిని పక్కన పెట్టేసింది. ఎన్నికల సమయంలో పూడికతీతపై టీడీపీ హామీనిచ్చింది. ఆమేరకు కేంద్ర ప్రభుత్వంతో కలసి సంయుక్తంగా రూ.97 కోట్లతో వాకాడు మండలం పూడిరాయదొరువు వద్ద పూడికతీతకు సిద్ధమైంది. ఆమేరకు బడ్జెట్‌లో ఆ ప్రతిపాదనలు పెట్టడంపై సూళ్లూరుపేట, గూడూరు ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, పాశిం సునీల్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. రెండు నియోజకవర్గాలలోని ద్వారా సుమారు 20వేల మంది మత్స్యకారులకు మంచి రోజులు రానున్నాయన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 01:21 AM