Sankranti Celebrations: నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబం సందడి
ABN, Publish Date - Jan 15 , 2024 | 12:09 PM
Andhrapradesh: సంక్రాంతిని పురస్కరించుకుని నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబం రాకతో సందడి వాతావరణం నెలకొంది. నారావారిపల్లె గ్రామదేవత దొడ్డి గంగమ్మకు చేసిన నారా నందమూరి కుటుంబం ప్రత్యేక పూజలు చేసింది. కులదైవం నాగదేవతలకు చంద్రబాబు కుటుంబం సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి నైవేద్యాల సమర్పించింది.
తిరుపతి, జనవరి 15: సంక్రాంతిని పురస్కరించుకుని నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబం రాకతో సందడి వాతావరణం నెలకొంది. నారావారిపల్లె గ్రామదేవత దొడ్డి గంగమ్మకు నారా నందమూరి కుటుంబం ప్రత్యేక పూజలు చేసింది. కులదైవం నాగదేవతలకు చంద్రబాబు కుటుంబం సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి నైవేద్యాల సమర్పించింది. అనంతరం తల్లిదండ్రులు నారా ఖర్జూరం నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధులకు టీడీపీ చీఫ్ చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu), సతీమణి భువనేశ్వరి (Bhuvaneshwari), కుమారుడు లోకేష్ (TDP Leader Lokesh), రోహిత్, దేవాన్ష్ ఇతర కుటుంబీకులు నివాళి అర్పించారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు కుటుంబం నివాళి అర్పించింది.
ఆపై ఇంట్లో పురోహితుల ఆధ్వర్యంలో పిండ ప్రధాన పూజలు, వస్త్ర సమర్పణ చేసి పెద్దలు ఆశీస్సులను చంద్రబాబు తీసుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం చంద్రగిరి నియోజకవర్గం ఇంచార్జ్ పులవర్తి నాని (Chandragiri Constituency Incharge Pulavarthy Nani) నివాసానికి టీడీపీ చీఫ్ వెళ్లనున్నారు. ఇటీవల దొంగ ఓట్లపై నిరసన కార్యక్రమంలో పులివర్తి నాని గాయాల పాలైన విషయం తెలిసిందే. నానిని పరామర్శించి ఆపై చంద్రబాబు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 15 , 2024 | 12:11 PM