Tirumala: తిరుమల వెళ్తున్న భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ దారి మూసేస్తూ టీటీడీ సంచలన నిర్ణయం..
ABN, Publish Date - Oct 16 , 2024 | 05:40 PM
రేపు శ్రీవారి మెట్ల నడకమార్గాన్ని మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ప్రకటించారు. తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా.. భక్తులు ఇబ్బందులు పడకుండా గురువారం శ్రీవారి మెట్ల నడకమార్గాన్ని ..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా.. నడక మార్గంలో తిరుమల కొండకు చేరుకోవాలనుకున్నారా.. శ్రీవారి మెట్ల మార్గం గుండా వెళ్లాలని ప్లాన్ చేసుకుని ఉంటే వెంటనే మీ నిర్ణయాన్ని మార్చుకోండి. రేపు శ్రీవారి మెట్ల నడకమార్గాన్ని మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ప్రకటించారు. తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా.. భక్తులు ఇబ్బందులు పడకుండా గురువారం శ్రీవారి మెట్ల నడకమార్గాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. అయితే అలిపిరి నుంచి నడక మార్గానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో అలిపిరి గుండా నడుచుకుంటూ తిరుమల వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు. కేవలం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి వెళ్లాలనుకునేవారు మాత్రం గురువారం ఆ మార్గంలో వెళ్లవద్దని టీటీడీ అధికారులు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Oct 16 , 2024 | 06:14 PM