ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సిలికా మైన్ల హార్డ్‌ డిస్క్‌లు,ఫైళ్లు దహనం?

ABN, Publish Date - Jun 11 , 2024 | 01:54 AM

కోట, చిల్లకూరు మండలాల్లోని సిలికా మైన్లకు సంబంధించిన సమాచారంతో కూడిన కీలక హార్డ్‌డి్‌స్కలు, సీడీలు, ఫైళ్లు దగ్ధం చేసినట్లు సమాచారం.

కోట మండలం కొత్తపట్నంలో తవ్వుతున్న సిలికా (ఫైల్‌ ఫొటో)

కోట, జూన్‌ 10 : కోట, చిల్లకూరు మండలాల్లోని సిలికా మైన్లకు సంబంధించిన సమాచారంతో కూడిన కీలక హార్డ్‌డి్‌స్కలు, సీడీలు, ఫైళ్లు దగ్ధం చేసినట్లు సమాచారం.ఈ రెండు మండలాల్లోని 1150.97 హెక్టార్లల్లో 73 సిలికా మైన్ల లీజులున్నాయి.ఈ మైన్ల నుంచి సంవత్సరానికి రూ.443 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం రావాల్సి ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతలు కొంతమంది సిలికా మైన్లను సిండికేట్‌లోకి తీసుకొని కోట్లాది రూపాయల రాయల్టీని ప్రభుత్వానికి ఎగనామం పెడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌ తరువాత గనుల శాఖ, ఏపీఎంబీసీ సిలికా తవ్వకాలు జరపరాదని నిషేధం విధించింది. అప్పటి వరకు చిల్లకూరు, కోట మండలాల్లో అనధికారిక సిలికా లావాదేవీలు, బిల్లులు, రవాణాలకు సంబంధించిన సమాచారాన్ని అంతా హార్డ్‌డి్‌స్కలు, సీడీలు, ఫైళ్ల రూపంలో పొందుపరిచినట్లు సమాచారం. ఎలాగో వైసీపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో ఆ పార్టీ కీలక నేతలు ఇద్దరు ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచారు. ఈ నెల 4వ తేదీ కౌంటింగ్‌ తరువాత టీడీపీ అధికారంలోకి రావడంతో ఎక్కడ ఈ ఫైళ్ల బాగోతం బయటపడుతుందోనని కోట మండలం కొత్తపట్నం మైన్ల వద్ద ఆ సమాచారాన్ని నాలుగు రోజుల క్రితం రాత్రి వేళ తగులబెట్టినట్లు సమాచారం.ఒక పక్క బేవరేజ్‌సపై తనిఖీలు జరుపుతూ శాఖలవారీగా ఫైౖళ్లు స్వాధీనం చేసుకుంటున్న ఆయా శాఖల ఉన్నతాధికారుల తీరుతో వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. దీంతో అనుమతులు ఒకచోట తీసుకుని మరోచోట సిలికా తవ్వకాలు జరపడంతో పాటు ఎగుమతులకు సంబంధించిన వే బిల్లులను దహనం చేసినట్లు తెలిసింది.ఫైళ్లను కాల్చివేసిన సమాచారం గనుల శాఖ ఉన్నతాధికారులకు కూడా అందిందని సమాచారం.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 01:54 AM

Advertising
Advertising