ప్రత్యేక రైలుమార్గం
ABN, Publish Date - Jul 31 , 2024 | 02:33 AM
రేణిగుంట- సీఆర్‌ఎస్ మధ్య ప్రత్యేక రైలు మార్గం ఏర్పాటు చేయడానికి ఉన్నత స్థాయి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
రేణిగుంట- సీఆర్‌ఎస్ మధ్య
తిరుపతి(సెంట్రల్), జూలై 30: రేణిగుంట- సీఆర్‌ఎస్ మధ్య ప్రత్యేక రైలు మార్గం ఏర్పాటు చేయడానికి ఉన్నత స్థాయి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు వినాయకనగర్ నుంచి రైల్వేస్టేషన్ వరకు నిర్మాణ పనులు ప్రారంభించారు. తిరుపతి- రేణిగుంట రైల్వేస్టేషన్ల మధ్య రోజు రోజుకూ రైళ్ల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ఉన్న రెండు రైలు మార్గాలు చాలడం లేదు. మరోవైపు మరమ్మతులు చేయడానికి రైలు పెట్టెలను సీఆర్‌ఎ్‌సకు తీసుకెళ్లడానికి, తిరిగి తీసుకురావడానికి కూడా ఇబ్బందిగా మారింది. దీనివల్ల పలు రైళ్ల రాకపోకలకు ఆలస్యం జరుగుతోందని ఉన్నతస్థాయి అధికారులు గుర్తించారు. అలాగే రేణిగుంట సీబీఐడీ కాలనీ వద్ద గూడ్స్‌షెడ్ యార్డ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ పనుల కోసం రూ.25 కోట్లు నిధులు కూడా మంజూరవడంతో కాంట్రాక్టర్లు పనులను ప్రారంభించారు. మంగళవారం వినాయకనగర్ సమీపంలో అడ్డుగా ఉన్న రైలు పట్టాలను తొలగించే పనులు చేపట్టారు. ఈ ప్రత్యేక రైలుమార్గం పూర్తయితే తిరుపతి - రేణిగుంట రైల్వేస్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలకు ఆలస్యం సమస్య తీరనుంది.
Updated Date - Jul 31 , 2024 | 02:33 AM