TDP, Janasena: సప్త కనికలమ్మ ఆలయంలో టీడీపీ, జనసేన ప్రత్యేక పూజలు
ABN, Publish Date - Jan 21 , 2024 | 11:01 AM
చిత్తూరు: దొడ్డిపల్లిలోని సప్త కనికలమ్మ ఆలయంలో టీడీపీ, జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గడపగడపకు రా.. కదలిరా.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని మొత్తం 50 డివిజన్లలో ప్రతిరోజు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
చిత్తూరు: దొడ్డిపల్లిలోని సప్త కనికలమ్మ ఆలయంలో టీడీపీ, జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గడపగడపకు రా.. కదలిరా.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని మొత్తం 50 డివిజన్లలో ప్రతిరోజు ఈ కార్యక్రమం కొనసాగనుంది. టీడీపీ నుంచి టికెట్టు ఆశిస్తున్న ఆరుగురు ఆశావహలు కలిసికట్టుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఆధ్వర్యంలో ఆరుగురు ఆశావహులు చంద్ర ప్రకాష్, గురజాల జగన్మోహన్, కటారి హేమలత, కాజురు బాలాజీ, డీకే కుటుంబం, సీఆర్ రాజన్‌లు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును సీఎంగా గెలిపించుకోవడమే లక్ష్యంగా కార్యక్రమం చేట్టారు.
Updated Date - Jan 21 , 2024 | 11:02 AM