ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముగిసిన టెట్‌ పరీక్షలు

ABN, Publish Date - Oct 22 , 2024 | 02:15 AM

జిల్లాలో 16 రోజులుగా సాగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) సోమవారంతో ముగిసింది. జిల్లావ్యాప్తంగా 9 కేంద్రాల్లో ఈ నెల 3 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు.

పరీక్ష కేంద్రం వెనుక ప్రవేశ మార్గం వద్ద అభ్యర్థులు

చివరి రోజు అభ్యర్థులకు కష్టాలు

16 రోజులుగా 9 కేంద్రాల్లో పరీక్షలు

31,840 మంది హాజరు.. 4,919 మంది గైర్హాజరు

తిరుపతి విద్య, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 16 రోజులుగా సాగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) సోమవారంతో ముగిసింది. జిల్లావ్యాప్తంగా 9 కేంద్రాల్లో ఈ నెల 3 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. 36,759 మంది నమోదు చేసుకోగా 31,840 మంది హాజరయ్యారు. 4,919 మంది గైర్హాజరయ్యారు. సోమవారం జిల్లాలోని మూడు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. నాగలాపురం శ్రీవెంకటపెరుమాళ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, రంగంపేట, రామిరెడ్డిపల్లెలోని అయాన్‌ డిజిటల్‌ జోన్‌, తిరుపతి చెర్లోపల్లిలోని అయాన్‌ డిజిటల్‌ జోన్‌ కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. 1,507 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 1,299 మంది పరీక్షలకు హాజరయ్యారు. 208 మంది గైర్హాజరయ్యారు.

అభ్యర్థులకు కష్టాలు

టెట్‌ పరీక్షల చివరి రోజున తిరుపతి చెర్లోపల్లి అయాన్‌ డిజిటల్‌ జోన్‌లో అభ్యర్థులకు కష్టాలు ఎదురయ్యాయి. అనంతపురం, కడప, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, కర్నూలు, నంద్యాల తదితర ప్రాంతాల నుంచి అభ్యర్థులు వచ్చారు. సెల్‌ఫోన్లు, బ్యాగ్‌లను భద్రపరిచేందుకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేయడంతో అభ్యర్థులు రెండుచోట్ల క్యూలలో గంటలకొద్దీ వేచి ఉండాల్సి వచ్చింది. పరీక్ష కేంద్రంలోకి రెండు ప్రవేశ మార్గాలు ఉన్నప్పటికీ కేంద్ర వెనుకవైపున్న ఓ చిన్నపాటి మార్గంలోంచి ప్రవేశం కల్పించడంతో అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలో తాగునీరు పెట్టలేదని తెలిపారు. పరీక్ష జరుగుతున్న సమయంలో అధికారులు మైకులో సూచనలు చేయడం ఏకాగ్రతకు భంగం కలిగించిందని, సిబ్బంది తమపట్ల దురుసుగా వ్యవరించారని ఆరోపించారు.

Updated Date - Oct 22 , 2024 | 02:15 AM