Tirupati audience తిరుపతి ప్రేక్షకులకు థ్యాంక్స్
ABN, Publish Date - Sep 12 , 2024 | 02:44 AM
35 చిన్న కథ కాదు’ సినిమాను ఆదరించిన తిరుపతి ప్రేక్షకులకు హీరోయిన్ నివేదా థామస్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం రాత్రి హీరో విశ్వదేవ్, అసిస్టెంట్ డైరెక్టర్ హరిహర్ష తదితరులతో కలసి తిరుపతిలోని కృష్ణతేజ థియేటర్‌ను ఆమె సందర్శించారు.
‘35 చిన్న కథ కాదు’ సినిమాను ఆదరించిన తిరుపతి ప్రేక్షకులకు హీరోయిన్ నివేదా థామస్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం రాత్రి హీరో విశ్వదేవ్, అసిస్టెంట్ డైరెక్టర్ హరిహర్ష తదితరులతో కలసి తిరుపతిలోని కృష్ణతేజ థియేటర్‌ను ఆమె సందర్శించారు. కాసేపు ప్రేక్షకుల మధ్య సినిమాను వీక్షించారు.తిరుపతి జిల్లా పరిసర ప్రాంతాల్లోనే ‘35 చిన్న కథ కాదు’ సినిమా షూటింగ్ జరిగిందని గుర్తు చేసుకున్న ఆమె చిన్న సినిమా అయినా గొప్పగా ఆదరించారని కొనియాడారు.ప్రేక్షకుల ప్రోత్సాహం ఇలాగే కొనసాగాలని కోరారు.
- తిరుపతి అర్బన్
Updated Date - Sep 12 , 2024 | 02:44 AM